ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికా గోల్డెన్ వీసా ప్రోగ్రామ్‌ గురించి మీకు తెలుసా..?

ABN, First Publish Date - 2022-09-18T05:24:28+05:30

అమెరికాలో స్థిరపడాలనుకునే విదేశీ పెట్టుబడిదారుల కోసం ఉద్దేశించిన ఈబీ-5 ఇమిగ్రెంట్ ఇన్వెస్టర్ ప్రోగ్రామ్‌కు అమెరికా ప్రభుత్వం ఇటీవల కాలంలో పలు కీలక మార్పులు చేసింది. తద్వారా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: అమెరికాలో స్థిరపడాలనుకునే విదేశీ పెట్టుబడిదారుల కోసం ఉద్దేశించిన ఈబీ-5 ఇమిగ్రెంట్ ఇన్వెస్టర్  ప్రోగ్రామ్‌కు అమెరికా ప్రభుత్వం ఇటీవల కాలంలో పలు కీలక మార్పులు చేసింది. తద్వారా..మొత్తం ప్రక్రియను మరింత సులభతరం చేసింది. అమెరికా గోల్డెన్ వీసాగా(Golden Visa) పేరుపడ్డ ఈబీ-5 ప్రోగ్రామ్(EB-5 program) ద్వారా విదేశీపెట్టుబడి దారులు, వారి జీవిత భాగస్వాములతో పాటూ 21 ఏళ్ల లోపున్న వారి సంతానికి కూడా గ్రీన్ కార్డు(Green Card) లభిస్తుంది. అయితే.. అమెరికాలో కనీసం 8 లక్షల డాలర్ల పెట్టుబడులు పెట్టేవారు మాత్రమే ఈబీ-5కి అర్హులు. అమెరికా నిబంధనల ప్రకారం.. ఈ పెట్టుబడి ద్వారా ఉద్యోగకల్పన కూడా జరగాలి. 


ఈబీ-5 రిఫార్మ్ ఇంటెగ్రిటీ యాక్ట్-2022 చట్టం ద్వారా ఈ ఏడాది ప్రథమార్థంలో అమెరికా ప్రభుత్వం ఈబీ-5కి కొన్ని కీలక మార్పులు చేసింది. ఈబీ-5 అమలులో పారదర్శకత, అమెరికాకు వచ్చే విదేశీయుల భద్రత దృష్టిలో పెట్టుకుని ఈ మార్పులకు శ్రీకారం చుట్టుంది. దీంతో.. ఈబీ-5 కార్యక్రమాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగించినట్టైంది. 2026 సెప్టెంబర్ 30లోపు దాఖలైయ్యే దరఖాస్తులను పరిశీలించి,  విదేశీయులను దేశంలోకి అనుతిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఫలితంగా..ప్రస్తుత లబ్ధిదారులకు తమ భవిష్యత్తుపై కొంత భరోసా లభించినట్టైంది. భవిష్యత్తులో ఈ ప్రోగ్రామ్‌ను రద్దు చేయాల్సిన పరిస్థులు రావొచ్చన అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ వెసులుబాటును కల్పించింది.

 

అంతేకాకుడా.. తాజా మార్పుల కారణంగా ఈబీ-5 పెట్టుబడిదారులు తమ గ్రీన్ కార్డు దరఖాస్తు పరిశీలనలో ఉండగానే అమెరికాలో చదువు, ఉద్యోగం వంటి వ్యాపకాలు చేపట్టవచ్చు. మూతపడ్డ వ్యాపార సంస్థల్లో ఈబీ-5 లబ్ధిదారులు పెట్టుబడి పెడతారు కాబట్టి అమెరికా ప్రభుత్వం నుంచి వారికి మరిన్ని ఇతర ప్రయోజనాలు కూడా అందనున్నాయి. 


Updated Date - 2022-09-18T05:24:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising