ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రియాధ్‌లో నూతన ఉత్సాహాన్ని రేకెత్తించిన ఉగాది వేడుకలు

ABN, First Publish Date - 2022-04-11T20:01:58+05:30

కరోనా ఆంక్షలతో రెండేళ్లపాటు సామాజిక కార్యక్రమాలకు దూరంగా ఉన్న గల్ఫ్ దేశాలలోని ప్రవాసీయులు ఇప్పుడిప్పుడె సామాజిక కార్యక్రమాలు, వేడుకలకు చెరువవుతున్నారు. నూతన తెలుగు సంవత్సరం ఉగాది వేడుకలు గల్ఫ్ దేశాలలో ఇప్పటికీ ఉత్సాహం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: కరోనా ఆంక్షలతో రెండేళ్లపాటు సామాజిక కార్యక్రమాలకు దూరంగా ఉన్న గల్ఫ్ దేశాలలోని ప్రవాసీయులు ఇప్పుడిప్పుడె సామాజిక కార్యక్రమాలు, వేడుకలకు చెరువవుతున్నారు. నూతన తెలుగు సంవత్సరం ఉగాది వేడుకలు గల్ఫ్ దేశాలలో ఇప్పటికీ ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. సౌదీ అరేబియా రాజధాని రియాధ్‌లో శుక్రవారం సాయంత్రం శ్రీ శుభకృత్ నామ ఉగాది సంవత్సర వేడుకలు అత్యంత వైభవంగా ఆనందభరితంగా జరిగాయి. ఏపీ ఎన్నార్టీ, తెలుగు కళా క్షేత్రం ఆధ్వర్యంలో ఏపీ ఎన్నార్టీ కోఆర్డినేటర్ అంథోని రెబల్ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమం చాల కాలం తర్వాత రియాధ్ నగరంలోని తెలుగు ప్రవాసీయులను ఆహ్లదపర్చింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ 75వ స్వాతంత్ర వేడుకల్లో భాగంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని భారత సీనియర్ దౌత్యవేత్త రాంప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. 



స్థానిక వైదేహి నృత్య విద్యాలయానికి చెందిన రేష్మీ వినోద్ ఆధ్వర్యంలో జరిగిన సంప్రదాయ నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నిలంబరి పాటపై సమంత్, హితార్ధ్, కుందన్, శౌర్య, తాహా, నందన్, పృథ్వీ, వినేష్, ఆర్షిత్, రియాన్, హిమంగ, సామ్నవి, భవిష్యలు చేసిన గ్రూప్ డాన్స్‌పై కూడా సభికులు చప్పట్ల వర్షం కురిపించారు. హైదరాబాద్‌కు చెందిన చేతన ప్రేం తన మధుర స్వరానికి తోడుగా సన్నివేశాల సందర్భానుసారంగా చేసిన వ్యాఖ్యాలతో నిజమైన వ్యాఖ్యాతగా ప్రశంసలు పొందారు. పక్కా ఆంధ్ర పంచె-ధోతితో తరుణ్ కృష్ణా కూడ ఆకర్షనీయంగా నిలిచారు. సుమన్, బైరి సత్యనారాయణ, నవీన్, సుబ్బు, రంజీ, గాలి రవి, స్వామి, రావూరి, గోపి చందర్‌లు కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, భారతీయ ఎంబసీ అధికారులకు అంథోని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రియాధ్‌లో తెలుగు సంస్కృతి పరిరక్షణ మరియు సాంస్కృతిక ఉల్లాసంతో పాటు ప్రవాసీయుల సంక్షేమానికి తెలుగు కళా క్షేత్రం తమ వంతుగా ప్రయత్నిస్తుందని ఈ సందర్భంగా ఆయన పెర్కోన్నారు.




Updated Date - 2022-04-11T20:01:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising