ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

UAE: ప్రయాణ నిబంధనలు సడలింపు

ABN, First Publish Date - 2022-04-14T18:42:45+05:30

రోజురోజుకు కరోనావైరస్ ప్రభావం తగ్గుముఖం పడుతుండడంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ప్రయాణ నిబంధనలను సడిలించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అబుదాబి: రోజురోజుకు కరోనావైరస్ ప్రభావం తగ్గుముఖం పడుతుండడంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ప్రయాణ నిబంధనలను సడిలించింది. వ్యాక్సిన్ తీసుకోని దేశ పౌరులను ఇతర దేశాలకు వెళ్లకుండా ఉన్న నిషేధాన్ని తాజాగా ఎత్తివేసింది. ఈ నెల 16 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని ప్రకటించింది. అయితే, ప్రయాణికులు తప్పనిసరిగా జర్నీకి 16 గంటలలోపు పీసీఆర్ టెస్టు చేయించుకున్న రిపోర్టును చూపించాల్సి ఉంటుందని ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. అలాగే గ్రీన్ స్టేటస్ పొందడానికి అల్ హోస్నా యాప్‌లో ప్రయాణానికి సంబంధించిన ఫామ్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. 


ఇక ఇంతకుముందు యూఏఈ పౌరులు విదేశాలకు వెళ్లాలంటే వ్యాక్సిన్, బూస్టర్ డోసు తప్పనిసరి. ఇప్పుడు దీని నుంచి మినహాయింపు దొరికింది. దీంతో పాటు 16 ఏళ్ల కంటే తక్కువ వయస్సు గల పిల్లలు కరోనా వ్యాక్సిన్లు వేయించుకోకపోయినా విదేశాలకు వెళ్లడానికి పీసీఆర్ టెస్టు చేయించుకోవాల్సిన అవసరం లేదు. గతంలో ఈ మినహాయింపు కేవలం 12 ఏళ్లలోపు చిన్నారులకు మాత్రమే ఉండేది. ఇక వ్యాక్సినేషన్‌లో దూసుకెళ్లిన యూఏఈ.. కరోనా మరణాలను నిలువరించడంలో చాలా వరకు సఫలం అయిందనే చెప్పాలి. కారణం.. వైరస్ వల్ల అతి తక్కువ మరణాల రేటును యూఏఈ కలిగి ఉండడమే. ఇలా తక్కువ మరణాల రేటులో ప్రపంచవ్యాప్తంగా 9వ స్థానంలో ఉంది. మార్చి 8 నుంచి ఇప్పటివరకు ఆ దేశంలో ఒక్క కోవిడ్ సంబంధిత మరణం నమోదు కాలేదు.

Updated Date - 2022-04-14T18:42:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising