ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

UAE, కువైత్, సింగపూర్ వెళ్లే భారతీయులు.. ఆయా దేశాల కొత్త ట్రావెల్ గైడ్‌లైన్స్‌పై ఓ లుక్కేయండి..

ABN, First Publish Date - 2022-03-01T15:48:56+05:30

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావం క్రమంగా తగ్గుతుండడంతో చాలా దేశాలు ప్రయాణ ఆంక్షలను సడలిస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావం క్రమంగా తగ్గుతుండడంతో చాలా దేశాలు ప్రయాణ ఆంక్షలను సడలిస్తున్నాయి. ఇదే కోవలో యూఏఈ, కువైత్, సింగపూర్ కూడా ప్రత్యేకంగా భారతీయ ప్రయాణికుల కోసం ప్రయాణ మార్గదర్శకాలను సవరించాయి. అందుకే ఆయా దేశాలకు వెళ్లే ఆలోచనలో ఉంటే అవి సవరించిన ప్రయాణ మార్గదర్శకాలను తెలుసుకోవడం బెటర్. ఈ మూడు దేశాలు భారతీయ ప్రయాణికుల కోసం మార్చిన ట్రావెల్ గైడ్‌లైన్స్‌‌పై ఓ లుక్కేద్దాం...


యూఏఈ ప్రయాణ మార్గదర్శకాలివే..

భారత్ నుంచి తమ దేశానికి వచ్చే ప్రయాణికుల కోసం యూఏఈ తాజాగా ప్రయాణ మార్గదర్శకాలను సవరించింది. వ్యాక్సినేషన్ పూర్తైన ప్రయాణికులు తమ జర్నీకి ముందు చేయించుకునే ఆర్‌టీ-పీసీఆర్ పరీక్ష ఇకపై అవసరం లేదు. అయితే, వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌ను ఎయిర్ సువిధ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక వ్యాక్సినేషన్ పూర్తికాని ప్రయాణికులు ప్రయాణానికి 72 గంటల ముందు టెస్టు చేయించుకున్న ఆర్‌టీ-పీసీఆర్ పరీక్ష తాలూకు నెగెటివ్ ధృవపత్రాన్ని సువిధ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి. అలాగే ప్రయాణికుల్లో ఎవరికైనా రోగ లక్షణాలు ఉంటే థర్మల్ స్క్రీనింగ్ అనంతరం కొత్త మార్గదర్శకాలనుసారం చికిత్స అందించడం జరుగుతుంది. 


సింగపూర్ సవరించిన ట్రావెల్ గైడ్‌లైన్స్..

సింగపూర్ ఎయిర్‌లైన్స్ (ఎస్ఐఏ) నివేదిక ప్రకారం భారతదేశం నుండి వీటీఎల్ (వ్యాక్సినేట్ ట్రావెల్ లేన్‌లు) విమానాల ద్వారా వచ్చే వారి కోసం ప్రయాణ మార్గదర్శకాలను నవీకరించినట్లు తెలిసింది. ప్రయాణికులు తప్పనిసరిగా 7 రోజుల ట్రావెల్ హిస్టరీని చూపించాలి. అలాగే ప్రయాణికులు గత 7 రోజులగా సింగపూర్‌లో ఉన్నట్లయితే, సింగపూర్‌లో వారి ఆ 7 రోజుల బస ట్రావెల్ హిస్టరీలో లెక్కించబడుతుంది. 


కువైత్ ప్రయాణ మార్గదర్శకాలు..

కువైత్ కూడా తన ప్రయాణ మార్గదర్శకాలను  అప్‌డేట్ చేసింది. సవరించిన మార్గదర్శకాల ప్రకారం, చెల్లుబాటు అయ్యే ప్రయాణ పత్రాలను కలిగి ఉన్న ప్రయాణీకులు వారి వ్యాక్సినేషన్ స్టేటస్‌తో సంబంధం లేకుండా కువైత్‌లోకి ప్రవేశించడానికి అనుమతించబడతారు.

Updated Date - 2022-03-01T15:48:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising