ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Abu Dhabi Big Ticket: ఇద్దరు భారతీయ మిత్రులకు జాక్‌పాట్.. గెలిచిన భారీ నగదుతో కూరగాయల వ్యాపారం

ABN, First Publish Date - 2022-05-19T14:56:02+05:30

ఉపాధి కోసం అబుదాబి వెళ్లిన ఇద్దరు భారత ప్రవాసులకు Abu Dhabi Big Ticket రూపంలో జాక్‌పాట్ తలిగింది. బుధవారం నిర్వహించిన బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో ఇండియాకు చెందిన డియోన అన్నా బిను, షరీఫ్ పనిచాయిల్ ఏకంగా 5లక్షల దిర్హమ్స్(రూ.కోటి 5లక్షలు) గెలుచుకున్నారు. ఇటీవల ఈ ఇద్దరు మిత్రులు కలిసి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అబుదాబి: ఉపాధి కోసం అబుదాబి వెళ్లిన ఇద్దరు భారత ప్రవాసులకు Abu Dhabi Big Ticket రూపంలో జాక్‌పాట్ తలిగింది. బుధవారం నిర్వహించిన బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో ఇండియాకు చెందిన డియోన అన్నా బిను, షరీఫ్ పనిచాయిల్ ఏకంగా 5లక్షల దిర్హమ్స్(రూ.కోటి 5లక్షలు) గెలుచుకున్నారు. ఇటీవల ఈ ఇద్దరు మిత్రులు కలిసి కొనుగోలు చేసిన లాటరీ టికెట్ నం.069002కు ఈ జాక్‌పాట్ తగిలింది. వారిద్దరూ గడిచిన రెండేళ్ల నుంచి క్రమం తప్పకుండా బిగ్ టికెట్ రాఫెల్‌లో లాటరీ టికెట్ కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. తాజాగా ఇంత భారీ మొత్తం గెలుచుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. 


పనిచాయిల్ అబుదాబిలోని ముస్సాఫాలో చిన్న కూరగాయల మార్కెట్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, తాను గెలిచిన భారీ నగదులో కొంత భాగం తన కూరగాయల బిజినెస్‌ను విస్తరించడంలో వినియోగిస్తానని తెలిపాడు. మరో విజేత బిను మాట్లాడుతూ చాలా రోజులుగా మంచి ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లు పేర్కొన్నాడు. ఇలాంటి సమయంలో తనకు భారీ మొత్తం చేతికి వస్తుండడం ఆనందంగా ఉందన్నాడు. తాను కూడా అబుదాబిలో కూరగాయల వ్యాపారం మొదలు పెడతానని చెప్పుకొచ్చాడు. 

Updated Date - 2022-05-19T14:56:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising