ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jackpot: పొట్టకూటి కోసం దుబాయ్ వెళ్లిన 20 మంది భారత ప్రవాసులు.. రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారిన వైనం.. అసలేం జరిగిందంటే..

ABN, First Publish Date - 2022-10-06T14:16:04+05:30

దుబాయ్‌లో పని చేస్తున్న 20 మంది భారత ప్రవాసుల (Indian Expats) జీవితాలు రాత్రికి రాత్రే మారిపోయాయి. అందరూ కోటీశ్వరులు అయిపోయారు. పొట్టకూటి కోసం దుబాయ్ వెళ్లిన వారి జీవితాల్లో అబుదాబి బిగ్‌ టికెట్ (Abu Dhabi Big Ticket) ఊహించని మార్పును తీసుకొచ్చింది. గత కొంతకాలంగా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అబుదాబి: దుబాయ్‌లో పని చేస్తున్న 20 మంది భారత ప్రవాసుల (Indian Expats) జీవితాలు రాత్రికి రాత్రే మారిపోయాయి. అందరూ కోటీశ్వరులు అయిపోయారు. పొట్టకూటి కోసం దుబాయ్ వెళ్లిన వారి జీవితాల్లో అబుదాబి బిగ్‌ టికెట్ (Abu Dhabi Big Ticket) ఊహించని మార్పును తీసుకొచ్చింది. గత కొంతకాలంగా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు లాటరీ టికెట్ కొనుగోలు చేస్తున్న ఈ 20 మంది స్నేహితులకు ఏకంగా 20 మిలియన్ దిర్హమ్స్(భారత కరెన్సీలో రూ.44.45కోట్లు) జాక్‌పాట్ తగిలింది. సెప్టెంబర్ 13న కొన్న సిరీస్ నం. 244, లాటరీ టికెట్ నం. 064141 ఇలా వారి జీవితాలను మార్చేసింది. గత కొంతకాలంగా వారు బిగ్‌టికెట్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నప్పటికీ.. ఈసారి మాత్రం ఇటీవలే కేరళ నుంచి దుబాయ్‌కి వచ్చిన తమ కొత్త మిత్రుడు ప్రదీప్ కేపీ పేరున సెప్టెంబర్ 13న ఆన్‌లైన్‌లోనే లాటరీ టికెట్ కొనుగోలు చేశారు. అదే ఈ 20 మంది మిత్రులకు కలిసి వచ్చింది. సోమవారం నిర్వహించిన బిగ్‌టికెట్ డ్రాలో వీరు కొన్న లాటరీ టికెట్ నం. 064141కు జాక్‌పాట్ తగలడంతో ఏకంగా రూ. 44.45కోట్లు గెలుచుకున్నారు. దాంతో వారి ఆనందానికి అవధుల్లేవు. 


ఇక వీరిలో చాలామంది దుబాయ్‌లోని ఓ కార్ల కంపెనీలో పని చేస్తున్నారని తెలిసింది. వారికి నెలవారీ జీతం కేవలం వెయ్యి దిర్హమ్స్(సుమారు రూ.22వేలు) మాత్రమే. మరికొందరు ఇతర పనులు చేస్తున్నారు. పొట్టకూటి కోసం దేశం కాని దేశంలో చాలిచాలని జీతాలతో బతుకిడుస్తున్న వీరి జీవితాలను అబుదాబి బిగ్ టికెట్ రాత్రికి రాత్రే మార్చేసింది. ఇప్పుడు వారందరూ కోటీశ్వరులే. ఈ బిగ్ ప్రైజ్‌మనీని అందరం సమానంగా పంచుకుంటామని ప్రదీప్ తెలిపాడు. ఇది తమతో పాటు తమవారి జీవితాలను సైతం మారుస్తుందని అన్నాడు. ఎప్పుడో ఒకసారి లాటరీ తగలకపోదా? తాము నగదు గెలవకపోమా? అనే ఆశతోనే ప్రతిసారి టికెట్ కొనుగోలు చేసేవాళ్లమని ప్రదీప్ చెప్పాడు. కానీ, ఇంత భారీ మొత్తం గెలుస్తామని మాత్రం కలలో కూడా ఊహించలేదని తెలిపాడు. స్వదేశం నుంచి ఇక్కడి వచ్చేందుకు అప్పులు చేశామని చెప్పిన అతడు.. ఈ నగదుతో వాటిని తీర్చడంతో పాటు తమ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగిస్తామని చెప్పుకొచ్చాడు.         

Updated Date - 2022-10-06T14:16:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising