ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Donald Trump: టాయిలెట్ ఫొటోలు వైరల్..! వైట్‌హౌస్‌లో ట్రంప్ అంత పని చేశారా..?

ABN, First Publish Date - 2022-08-09T23:30:48+05:30

అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో డోనాల్డ్ ట్రంప్(Donald Trump) కీలక డాక్యుమెంట్లను ఎవరికీ తెలీకుండా టాయిలెట్‌లో(Toilet) పడేసి వదిలించుకునే వారనేది కొంతకాలంగా వినిపిస్తున్న ఆరోపణ.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో డోనాల్డ్ ట్రంప్(Donald Trump) కీలక డాక్యుమెంట్లను(documents) ఎవరికీ తెలీకుండా టాయిలెట్‌లో(Toilet) పడేసి వదిలించుకునే వారనేది కొంతకాలంగా వినిపిస్తున్న ఆరోపణ. ముఖ్యమైన పత్రాలను ముక్కలుగా చించి కమోడ్‌లో పడేసి ఫ్లష్(Flush) చేసేవారని మీడియా కథనాలు కూడా వెలువడ్డాయి. ఈ ఆరోపణలను ట్రంప్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చినప్పటికీ.. తాజాగా వైరల్ అవుతున్న ఫొటోలు మరోసారి కలకలానికి దారితీశాయి. కాగితం ముక్కలతో నిండిన కమోడ్‌ చిత్రాలు ప్రస్తుతం నెట్టింట్లో గగ్గోలు పుట్టిస్తున్నాయి.


ప్రముఖ వార్తాపత్రిక న్యూయార్క్ టైమ్స్‌కు చెందిన రిపోర్టర్ మ్యాగీ హెబర్‌మన్ ఈ ఫొటోలను సంపాదించినట్టు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. త్వరలో మ్యాగీ ప్రచురించబోయే పుస్తకం కోసం ఓ వైట్‌హౌస్ అధికారి ఒకరు ఆమెకు ఇచ్చారట. ఈ విషయాన్ని మ్యాగీ స్వయంగా తెలిపారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మ్యాగీ శ్వేత సౌధంలో విలేకరిగా పనిచేశారు. కీలక పత్రాలను ట్రంప్ ఇలా వదిలించుకుంటున్నారంటూ ఆమె ఫిబ్రవరిలో తొలిసారిగా ఆరోపించారు.


ఇక కాగితాలతో ఉన్న రెండు కమోడ్‌ ఫొటోలను సోమవారం ఆక్సియోస్ అనే వార్తా వెబ్‌సైట్ ప్రచురించింది. వీటిల్లో ఒకటి శ్వౌతసౌధంలోనిదని సమాచారం. ఇక రెండో కమోడ్‌ ఎక్కడిదనేదానిపై స్పష్టత లేదు. అయితే.. వాటిల్లోని కాగితాలపై చేతిరాత ఉండటంతో అవి అధికారిక పత్రాలు కావనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాటిపై ఇద్దరు చట్టసభ సభ్యుల పేర్లు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. 


కాగా.. ట్రంప్ అధికార ప్రతినిధి తాజాగా ఈ వార్తలను ఖండించారు. ‘‘ఇలాంటి కథనాలు వండివార్చేందుకు బోలెడంత మంది సిద్ధంగా ఉన్నారు. ట్రంప్ వ్యతిరేక వార్తలను ప్రచురించేందుకు ఉత్సుకత ప్రదర్శించే మీడియా కోసం ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు. ఇక ట్రంప్ గతంలోనే ఈ వార్తలను తోసిపుచ్చారు. ఆ కథనాలన్నీ అవాస్తవాలని, ప్రచారం కోసం ఓ రిపోర్టర్ ఇలా చేస్తున్నారని విమర్శించారు.     



Updated Date - 2022-08-09T23:30:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising