ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Travel Chaos: పర్యాటకుల తాకిడితో ఐరోపా ఎయిర్‌లైన్స్ సంస్థల పాట్లు .. ‘వర్క్ ఫ్రం హోం వల్లే ఇదంతా.. ’

ABN, First Publish Date - 2022-08-02T05:19:18+05:30

కరోనా తరువాత విమానప్రయాణికుల తాకిడి ఒక్కసారిగా పెరగడంతో ఐరోపాలోని ప్రముఖ ఎయిర్‌లైన్స్ సంస్థలన్నీ ఉక్కిరిబిక్కి అవుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: కరోనా తరువాత విమానప్రయాణికుల తాకిడి ఒక్కసారిగా పెరగడంతో ఐరోపాలోని ప్రముఖ ఎయిర్‌లైన్స్ సంస్థలన్నీ ఉక్కిరిబిక్కి అవుతున్నాయి. దీనికి సిబ్బంది కొరత కూడా తోడవడంతో.. అనేక సంస్థ రద్దీని తట్టుకునేందుకు సర్వీసుల్లో కోత విధిస్తున్నాయి. ఈ పరిస్థితి కారణం వర్క్ ఫ్రం హోం సంస్కృతి(work from home) అని ఖతర్ ఎయిర్‌వేస్(Qatar airways) సీఈఓ అక్బర్ అల్ బకర్ తాజాగా పేర్కొన్నారు. బ్రిటన్‌లో జరుగుతున్న ఫార్న్‌బరో ఇంటర్నేషనల్ ఎయిర్‌షోలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పౌరవిమానయాన రంగం పాలిట ‘వర్క్ ఫ్రం హోం’ ఓ మహమ్మారిలా తయారైందన్నారు. ఇంటి నుంచి పని చేస్తూ సులభంగా డబ్బు ఎలా సంపాదించాలో ప్రజలకు తెలిసిపోయింది. ఒకప్పటిలా ఆఫీసులకు వచ్చి పని చేయాలని ఎవరో అనుకోవట్లేదు’’ అని చెప్పారు. 


అయితే.. ఎయిర్‌లైన్స్ మాత్రం మరో కారణం ఉందని చెబుతున్నాయి. కరోనా సంక్షోభం సమయంలో ఉద్యోగుల తొలగింపు, జీతాల తగ్గింపు కారణంగా సిబ్బంది కొరత తీవ్రస్థాయికి చేరిందని విమానయాన సంస్థల యూనియన్లు అంటున్నాయి. ఇక లండన్‌లోని ప్రముుఖ హీత్రూ ఎయిర్‌‌పోర్టులో సెప్టెంబర్‌ వరకూ రోజుకు లక్ష మంది ప్రయాణికులను మాత్రమే అనుమతించాలని యాజమాన్యం నిర్ణయించిన నేపథ్యంలోనే ఖతర్ ఎయిర్‌వేస్ సీఈఓ ఈ వ్యాఖ్యలు చేశారు. సమస్య రాబోతోందన్న విషయాన్ని ఎయిర్‌పోర్టు నిర్వహకులు ముందే గుర్తించి ఉంటే బాగుండేదన్నారు. 

Updated Date - 2022-08-02T05:19:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising