ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

US Tourist Visa: అమెరికా విజిటింగ్‌ వీసా కోసం తప్పని సుదీర్ఘ నిరీక్షణ.. ఏకంగా 522 రోజుల వెయిటింగ్!

ABN, First Publish Date - 2022-08-19T13:34:33+05:30

సెలవులైనా.. విహార యాత్రలైనా అందరి మదిలో ముందుగా మెదిలేది అమెరికా.. లేదంటే ఐరోపా. చదువు, ఉద్యోగం కోసం కూడా ఎక్కువ మంది భారతీయులు విదేశాలకు వెళ్తుంటారు. ఇలా ఏదో ఒక కారణంతో విదేశాలకు వెళ్లాలనుకునే వారికి రోజులు, నెలలు కాదు.. ఏకంగా ఏడాదిన్నరపాటు నిరీక్షణ తప్పడం లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీలో ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటే 2024 మార్చి లేదా ఏప్రిల్‌లో ఇంటర్వ్యూ!

ఐరోపా, కెనడా వెళ్లాలన్నా సుదీర్ఘ నిరీక్షణ

న్యూఢిల్లీ, ఆగస్టు 18: సెలవులైనా.. విహార యాత్రలైనా అందరి మదిలో ముందుగా మెదిలేది అమెరికా.. లేదంటే ఐరోపా. చదువు, ఉద్యోగం కోసం కూడా ఎక్కువ మంది భారతీయులు విదేశాలకు వెళ్తుంటారు. ఇలా ఏదో ఒక కారణంతో విదేశాలకు వెళ్లాలనుకునే వారికి రోజులు, నెలలు కాదు.. ఏకంగా ఏడాదిన్నరపాటు నిరీక్షణ తప్పడం లేదు. అంటే విజిటింగ్‌ వీసా కోసం ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటే ఎప్పుడో 2024 మార్చి లేదా ఏప్రిల్‌లో ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట! అమెరికాకు చెందిన ట్రావెల్‌.స్టేట్‌.జీవోవీ వెబ్‌సైట్‌ ప్రకారం న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో విజిటింగ్‌ వీసాల అపాయింట్‌మెంట్‌ కోసం సగటున 522 రోజులు వేచి చూడాల్సి వస్తోంది. స్టూడెంట్‌ వీసాల కోసం వెయిటింగ్‌ 471 రోజులుగా ఉంది. 


ముంబైలోనూ విజిటింగ్‌ వీసాల కోసం 517 రోజులు, స్టూడెంట్‌ వీసా కోసం 10 రోజులు నిరీక్షించాల్సి వస్తోంది. చెన్నైలో విజిటింగ్‌ వీసాల కోసం 557 రోజులు, నాన్‌-ఇమ్మిగ్రెంట్‌ వీసాల కోసం 175 రోజులు, హైదరాబాద్‌ నుంచి దరఖాస్తు చేసుకునే వారు విజిటింగ్‌ వీసా కోసం 518 రోజులు ఎదురు చూడాల్సి వస్తోంది. మనీ కంట్రోల్‌ నివేదిక ప్రకారం విజిటింగ్‌ వీసాల ఇంటర్వ్యూ కోసం యూఎస్‌ కాన్సులేట్‌ వద్ద 4 లక్షలకుపైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కెనడాకు వెళ్లాలనుకున్న వారి పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. కెనడా ఎంబసీ వద్ద 20 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక ఐరోపాకు వెళ్లేందుకు అవసరమైన షెన్‌జెన్‌ వీసా కోసం సుదీర్ఘ కాలం ఎదురుచూడాల్సి వస్తోంది. ఫ్రాన్స్‌, ఐస్‌లాండ్‌ దేశాలకైతే వీసా అపాయింట్‌మెంట్‌ స్లాట్‌లే లేవని మనీకంట్రోల్‌ సంస్థ వెల్లడించింది. సిబ్బందిని పెంచడం, కొన్ని రకాల వీసాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఈ వెయిటింగ్‌ సమయాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది.

Updated Date - 2022-08-19T13:34:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising