ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

'టాక్' లండన్ సంస్థను అభినందించిన బ్రిటన్ మహా రాణి

ABN, First Publish Date - 2022-01-23T18:23:03+05:30

గతేడాది అక్టోబర్‌లో లండన్ వేదికగా తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్ ) ఆధ్వర్యంలో టాక్ - చేనేత బతుకమ్మ & దసరా వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్రిటన్ మహా రాణి కి కృతఙ్ఞతలు తెలిపిన అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల

లండన్: గతేడాది అక్టోబర్‌లో లండన్ వేదికగా తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్ ) ఆధ్వర్యంలో టాక్ - చేనేత బతుకమ్మ & దసరా వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎంతో సామాజిక బాధ్యతతో కరోనా సమయంలో ప్రాణాలు సైతం లెక్కచెయ్యకుండా సేవలందించిన నైషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్ఎస్ యూకే), ప్రపంచవ్యాప్త కోవిడ్ వారియర్స్‌కి కృతజ్ఞతలు తెలుపుతూ లండన్ టవర్ బ్రిడ్జి ఆకృతిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం - ప్రభలత దంపతుల కుమార్తె నిత్య శ్రీ కూర్మాచలం టాక్ సంస్థ బతుకమ్మ వేడుకల వేదికగా జరిగిన విషయాలన్నింటినీ ప్రత్యేకించి నైషనల్ హెల్త్ సర్వీస్(ఎన్‌హెచ్ఎస్ యూకే), ప్రపంచవ్యాప్త కోవిడ్ వారియర్స్‌కి కృతజ్ఞతలు తెలిపిన విధానాన్ని మరియు ప్రవాస తెలంగాణ బిడ్డలు బతుకమ్మ వేడుకల్ని జరుపుకొనే విషయాలతో బ్రిటన్ మహా రాణికి ఒక లేఖ రాశారు.


ఇటీవల బ్రిటన్ మహా రాణి కార్యాలయం నిత్య శ్రీకి ప్రత్యుత్తరం పంపింది. మహారాణి బతుకమ్మ వేడుకల ఫొటోలను చూసి సంతోషం వ్యక్తం చేసిందని ఆ లేఖలో పేర్కొంది. ముఖ్యంగా వేడుకల్లో నైషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్ఎస్ యూకే), ప్రపంచవ్యాప్త కోవిడ్ వారియర్స్‌కి కృతజ్ఞతలు తెలపడం ఎంతో బాగుందని, టాక్ సంస్థ కృషిని అభినందించినట్టు తెలిపింది. అలాగే మహా రాణి దృష్టికి ఈ విషయాలను తీసుకొచ్చిన నిత్య శ్రీని కూడా ప్రత్యేకంగా అభినందించారు.


టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ.. బ్రిటన్ మహా రాణి తెలంగాణ రాష్ట్ర పండగ బతుకమ్మ వేడుకల్ని అభినందిచడం నిజంగా చాలా గర్వకారణం అని అన్నారు. అంతేకాకుండా ప్రతీ వేడుకల్లో సామాజిక అంశాల్ని జోడించే టాక్ సంస్థ, గతేడాది బతుకమ్మ వేడుకల్లో నైషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్ఎస్ యూకే), ప్రపంచవ్యాప్త కోవిడ్ వారియర్స్‌కి కృతజ్ఞతలు తెలిపిన తీరుని బ్రిటన్ మహారాణి దృష్టికి తీసుకెళ్లిన నిత్య శ్రీ కూర్మాచలంను అభినందించారు. అలాగే ఎంతో గొప్ప మనసుతో టాక్ సంస్థను అభినందించిన మహా రాణికి ప్రత్యేకంగా కృతఙ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ అభివృద్ధికి ఎంతో కృషి చేసి పని చేస్తున్న టాక్ కార్యవర్గ సభ్యుల్ని రత్నాకర్ అభినందనలు తెలిపారు. రెట్టింపు ఉత్సాహంతో టాక్ సంస్థ పని చేస్తూ ప్రవాస బిడ్డలకు సేవలందిస్తుందని కొనియాడారు. టాక్ మన సంస్కృతి సంప్రదాయాల్ని ప్రపంచానికి చాటిచెప్తుందని రత్నాకర్ పేర్కొన్నారు.



Updated Date - 2022-01-23T18:23:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising