ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Job Fraud: కెనడాలో జాబ్ పేరిట మహిళకు టోకరా.. చివరకు..

ABN, First Publish Date - 2022-08-08T23:45:44+05:30

కెనడా ఉద్యోగం పేరిట యువతిని మోసం చేసిన నిందితుడిని బెంగళూరు సైబర్ క్రైమ్ శాఖ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: కెనడాలో(Canada) ఉద్యోగం పేరిట మహిళను(35) మోసం చేసిన నిందితుడిని బెంగళూరు సైబర్ క్రైమ్ శాఖ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా ప్రకటనల ద్వారా డేవిడ్ రాజ్ అనే వ్యక్తి.. బెంగుళూరుకు చెందిన ఓ మహిళను ఉచ్చులోకి దింపినట్టు తెలిపారు. బాధితురాలి నుంచి రూ. 3.5 లక్షలు దోచుకున్నాడని చెప్పారు.  


పోలీసుల కథనం ప్రకారం..  కెనడా కంపెనీ తరపున ఇండియాలో పనిచేస్తున్న అధికారిగా డేవిడ్ తనని తాను బాధితురాలికి పరిచయం చేసుకున్నాడు. జాబ్ ఇప్పిస్తానని చెప్పి డబ్బు దండుకున్నాడు. నకిలీ ఐడీ కార్డులతో తీసుకున్న సిమ్ కార్డులను ఉపయోగించి ఆమెతో ఫోన్ సంభాషణలు జరిపాడు.  దీంతో.. నిందితుడిని గుర్తించడంలో పోలీసులకు మొదట్లో ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే పట్టువిడవకుండా ప్రయత్నాలు సాగించిన పోలీసులు అత్యాధునిక సాంకేతికత సాయంతో డేవిడ్ రాజ్‌ ఆచూకీ కనుగొన్నారు. ఇందిరా నగరంలోని ఓ ఇంట్లో అతడిని అరెస్టు చేశారు. అతడిపై గతంలోనూ ఇలాంటి పలు కేసులు ఉన్నట్టు వారు తెలిపారు. డేవిడ్ రాజ్ వద్ద ఉన్న పలు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఇతరులను ఉచ్చులో దింపేందుకు డేవిడ్ వీటినే వినియోగించాడని తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరు పరచగా.. న్యాయస్థానం అతడికి జుడీషియల్ కస్టడీ విధించింది. 

Updated Date - 2022-08-08T23:45:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising