ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Texas Woman Video: ‘గో బ్యాక్ టూ ఇండియా’.. టెక్సాస్ మహిళ జాత్యంహకార వ్యాఖ్యల వీడియో వైరల్..

ABN, First Publish Date - 2022-08-26T17:11:26+05:30

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి భారతీయులపై జాత్యంహకార వ్యాఖ్యలు కలకలం రేపాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టెక్సాస్: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి భారతీయులపై జాత్యంహకార వ్యాఖ్యలు కలకలం రేపాయి. టెక్సాస్‌లో ఓ అమెరికన్ మహిళ భారతీయ అమెరికన్లపై (Indian Americans) అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయింది. 'మీ ఇండియన్స్ అంటే నాకు పరమ అసహ్యం.. ' అంటూ బూతులు తిట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో సామాజిక మాధ్యమాల్లో (Social Media) వైరల్ అయింది. అది కాస్తా టెక్సాస్ పోలీసులకు (Texas Police) చేరడంతో సదరు మహిళను గురువారం అదుపులోకి తీసుకున్నారు. 


పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ ఘటన బుధవారం రాత్రి (అమెరికా కాలమానం ప్రకారం) టెక్సాస్ రాష్ట్ర డల్లాస్‌లో (Dallas) జరిగింది. ఒకచోట నిలబడి ఉన్న కొంతమంది భారతీయ అమెరికన్లను (Indian Americans) చూసిన ఓ అమెరికన్ మహిళ జాతివిద్వేష వ్యాఖ్యలతో విరుచుకుపడింది. నోటికి వచ్చిన బూతులు తిడుతూ రెచ్చిపోయింది. "మీ ఇండియన్స్ అంటే నాకు అసహ్యం. బెటర్ లైఫ్ కోసం అమెరికాకు వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని ఉచితంగా కావాలంటారు. నేను మెక్సికన్-అమెరికన్ అయినప్పటికీ ఇక్కడే పుట్టాను. ఇండియాలో బెటర్ లైఫ్ ఉంటే.. మళ్లీ ఇక్కడి రావడం ఎందుకు? గో బ్యాక్ ఇండియా" అని బూతులు తిట్టడం వీడియోలో రికార్డైంది. 


ఆమె అలా అకారణంగా తిడుతుండడంతో ఓ భారత సంతతి మహిళ ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేసింది. కానీ, సదరు అమెరికన్ మహిళ మరింత రెచ్చిపోయింది. ఈ వీడియో కాస్తా బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది కాస్తా టెక్సాస్ (Texas) పోలీసుల దృష్టికి వెళ్లడంతో సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను ఎస్మెరాల్డా అప్టన్‌గా గుర్తించిన పోలీసులు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 


ఇదిలాఉంటే.. అమెరికాలో (America) ఇంకా భారతీయులపై జాత్యహంకార దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎదో ఒక కారణంతోనో అకారణంగానో దూషించడం సర్వ సాధారణం అయిపోయింది. జాత్యహంకార దాడులపై (Racial Attacks) అమెరికా చట్టాలు చేసినా సరే అక్కడి ప్రజలు వాటిని చాలా తేలికగా తీసుకుంటున్నారు. అయితే తాగాజా జరిగిన సంఘంటన ఇంకా భారతీయులపై వివక్ష కొనసాగుతూనే ఉందని చెప్పడానికి నిదర్శనమని చెప్పవచ్చు.




Updated Date - 2022-08-26T17:11:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising