ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో ‘అమెజాన్‌’ను మోసగించి.. కటకటాల పాలైన భారత సంతతి వ్యక్తి!

ABN, First Publish Date - 2022-02-15T13:09:41+05:30

ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ను మోసగించిన కేసులో భారత సంతతి వ్యక్తి, ఆ సంస్థ మాజీ ఉద్యోగికి అమెరికాలోని డిస్ట్రిక్ట్‌ కోర్టు పది నెలల జైలు శిక్ష విధించింది. రూ.38 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. కాలిఫోర్నియా నార్త్‌రిడ్జ్‌కు చెందిన రోహిత్‌ కడిమిశెట్టి(28) గతంలో అమెజాన్‌లో పనిచేశారు. ఆ సమయంలో ఆయన ప్రతిభ చూపడంతో కేంద్ర కార్యాలయంలో నియమించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘అమెజాన్‌’ను మోసగించిన కేసులో అమెరికాలో ఐదుగురికి శిక్ష

వాషింగ్టన్‌: ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ను మోసగించిన కేసులో భారత సంతతి వ్యక్తి, ఆ సంస్థ మాజీ ఉద్యోగికి అమెరికాలోని డిస్ట్రిక్ట్‌ కోర్టు పది నెలల జైలు శిక్ష విధించింది. రూ.38 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. కాలిఫోర్నియా నార్త్‌రిడ్జ్‌కు చెందిన రోహిత్‌ కడిమిశెట్టి(28) గతంలో అమెజాన్‌లో పనిచేశారు. ఆ సమయంలో ఆయన ప్రతిభ చూపడంతో కేంద్ర కార్యాలయంలో నియమించారు. అయితే.. ఇక్కడే ఆయన అతితెలివి ప్రదర్శించి.. సంస్థను మోసగించారని.. దీంతో ఆయనను సస్పెండ్‌ చేశారని అటార్నీ బ్రౌన్‌ కోర్టుకు తెలిపారు. అయితే.. తర్వాత థర్డ్‌ పార్టీ పేరుతో మరో ఐదుగురితో కలిసి భారత్‌లోని అమెజాన్‌ వినియోగదారులను మోసం చేయడంతో పాటు సంస్థ రహస్య సమాచారాన్ని దొంగిలించారని బ్రౌన్‌ వివరించారు. వీరిలో హైదరాబాద్‌కు చెందిన నిషాద్‌ కుంజు కూడా ఉన్నారని తెలిపారు. 


ఉద్యోగం నుంచి తొలిగించిన తర్వాత కూడా తాను అమెజాన్‌ ఉద్యోగినేనంటూ.. 2017 నుంచి అమెజాన్‌ మార్కెట్‌ ప్లేస్‌ను మోసం చేసి.. భారీ లబ్ధి పొందారని పేర్కొన్నారు. భారత్‌లో కొంత మంది ఉద్యోగులకు లంచాలు ఇచ్చి అమెజాన్‌ సంస్థ రహస్యాలను సేకరించినట్టు కోర్టుకు వివరించారు. రహస్య ఈమెయిళ్లను సృష్టించి మోసాలకు పాల్పడ్డారని తెలిపారు. ఆయా మోసాలను రోహిత్‌ అంగీకరించినట్టు చెప్పారు. ఈ సందర్భంగా జడ్జి స్పందిస్తూ.. దీనిని తేలికగా తీసుకునేందుకు అవకాశం లేదని.. ఇది వ్యవస్థీకృత నేరమని వ్యాఖ్యానించారు. ఈ కేసులో రోహిత్‌ సహా ఎఫెరైమ్‌ రోసెన్‌బెర్గ్‌, జోసెఫ్‌ నీల్సెన్‌, క్రిస్టెన్‌ లెస్సీస్‌, హడిస్‌ న్యుహనోవిక్‌లకు 10 నెలల జైలు శిక్షను ఖరారు చేశారు. ఈ ఏడాది అక్టోబరు నుంచి శిక్షను అమలు చేయాలని ఆదేశించారు. మరో నిందితుడు, హైదరాబాద్‌కు చెందిన నిషాద్‌ కుంజుపై విచారణ జరగాల్సి ఉండడంతో ఆయనపై అభియోగపత్రం నమోదు చేయలేదని ఎఫ్‌బీఐ తెలిపింది.

Updated Date - 2022-02-15T13:09:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising