ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Washington లో తెలుగు రంగస్థల సంగీత, సాహితీ సదస్సు

ABN, First Publish Date - 2022-07-01T17:26:12+05:30

తెలుగు రంగస్థల సంగీత, సాహితీ సదస్సు వాషింగ్టన్ డీసీలో బుధవారం(జూన్ 29న) జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రవాసాంధ్రులు భాను మాగులూరి అధ్యక్షత వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: తెలుగు రంగస్థల సంగీత, సాహితీ సదస్సు వాషింగ్టన్ డీసీలో బుధవారం(జూన్ 29న) జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రవాసాంధ్రులు భాను మాగులూరి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.. సమకాలీన సమాజం మారుతున్నా, సంస్కృతి, సాంప్రదాయాలు మారుతున్నా ఇక్కడున్న తెలుగువారు భాషను, సంస్కృతిని మర్చిపోకుండా కాపాడుతున్నారు. తెలుగు భాషని, సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఒక జాతి అస్థిత్వాన్ని, ప్రత్యేకతను చాటిచెప్పేది మాతృభాషే అని గుర్తించుకోవాలని తెలిపారు. ముఖ్యంగా నాటక రంగాన్ని, కళలను, కళాకారులను ప్రవాసాంధ్రులు బాగా ప్రోత్సహిస్తున్నారని కొనియాడారు. ప్రాచీన కళలు అంతరించిపోకుండా కాపాడుతున్నారని గుర్తు చేశారు. 


రాష్ట్ర నాటక అకాడమీ మాజీ ఛైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ...  నాటక రంగం అనేకమంది నటులుగా ఎదిగి, జీవితంలో స్థిరపడేలా చేసింది. నాటకం ఒక జీవకళ, సజీవ కళ. నాలాంటి వేలాది మంది కళాకారులను ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ చెరగని స్థానం సంపాదించుకునేలా చేసింది. అమెరికా, యూరప్‌లలో మంచి సాంకేతిక పరిజ్ఞానం ఉంది. దానిని ఉపయోగించుకుని అత్యంత సహజంగా రంగస్థలంపై ఉంచుతున్నారు. గుంటూరు మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. కళ కళ కోసం కాదు.. సమాజం కోసం. ఎన్టీఆర్ లాంటి మహానటుడు ప్రపంచానికి పరిచయం కావడానికి నాటక రంగమే వేదిక అని తెలిపారు. గోపాలకృష్ణ లాంటి నటులు సమాజాన్ని అత్యంత సహజంగా రంగస్థలంపై ఉంచుతున్నారని చెప్పారు. 


భాను మాగులూరి మాట్లాడుతూ... తెలుగుభాష తీయదనాన్ని, తెలుగు భాష గొప్పదనాన్ని ప్రపంచానికి చాటాలి. మాతృభాషను, మాతృదేశాన్ని ఎవరు మర్చిపోకూడదు. ఈ కార్యక్రమం అనంతరం గుమ్మడి గోపాలకృష్ణ సత్యహరిశ్చంద్ర, చింతామణి, శ్రీకృష్ణరాయభారం పద్యాలను ఆలపించి ప్రేక్షకులను అలరించారు. అనంతరం ఆయనను సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ ఉయ్యూరు, చనుమోలు అనిల్ కుమార్, మన్నవ వెంకటేశ్వరరావు, శ్రీకాంత్ ఆచంట, శ్రీనివాస్ చావలి, కోట రామ్మోహన్ రావు, గౌరు వెంకటేశం, పురుషోత్తం, రాము జక్కంపూడి తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-07-01T17:26:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising