ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో తెలుగు ఆచార్యుడు త్రివిక్రమ్ రెడ్డికి అరుదైన అవార్డు

ABN, First Publish Date - 2022-01-25T13:56:17+05:30

అమెరికాలో తెలుగు ఆచార్యుడికి అరుదైన అవార్డు లభించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూజెర్సీ ఇనిస్టిట్యూబ్ ఆఫ్ టెక్నాలజీ వారి ఎక్స్‌లెన్స్ ఆఫ్ టీచింగ్ పురస్కారం

నెవార్క్, న్యూ జెర్సీ: అమెరికాలో తెలుగు ఆచార్యుడికి అరుదైన అవార్డు లభించింది. న్యూజెర్సీలో ఉంటున్న త్రివిక్రమ్ రెడ్డి భానోజీ పాలకు న్యూజెర్సీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్.జె.ఐ.టీ) ఎక్సలెన్ప్ ఆఫ్ టీచింగ్ పురస్కారాన్ని ప్రకటించింది. మెకానికల్ విద్యాబోధనలో అత్యుత్తమ అధ్యాపకుడని ఆయన సేవలను ప్రశంసించింది. మెషిన్ డిజైన్, మెకానికల్ సిస్టమ్ డిజైన్‌తో పాటు స్ట్రైస్ ఎనాలిసిస్.. కూడా చక్కగా బోధించే త్రివిక్రమ్ రెడ్డి ఎన్.జె.ఐ.టీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రేట్ మై ప్రొఫెసర్ అని ఇచ్చే ర్యాంకింగ్‌లో కూడా టాప్ రేటింగ్ వచ్చిన ప్రొఫెసర్‌గా త్రివిక్రమ్ రెడ్డి నిలిచారు. ఒక వైపు విద్యాబోధన కొనసాగిస్తూనే మరో వైపు బెక్టన్ డికిన్సన్ కంపెనీలో రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ స్టాప్ ఇంజనీరుగా కూడా త్రివిక్రమ్ రెడ్డి సేవలందిస్తున్నారు. రోగులకు మందులను సరఫరా చేసేందుకు సరికొత్త పరికరాలను కూడా త్రివిక్రమ్ రెడ్డి రూపొందించారు. ఇలా తాను రూపొందించిన ఏడు పరికరాలకు పేటెంట్లను కూడా సాధించారు. తాజాగా ఎన్.జె.ఐ.టీ వారి ఎక్స్‌లెన్స్ ఆఫ్  టీచింగ్ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందని త్రివిక్రమ్ రెడ్డి తెలిపారు. తన బోధనలు, పరిశోధనలు మరింత ఉత్సాహంతో కొనసాగిస్తానని పేర్కొన్నారు. 

Updated Date - 2022-01-25T13:56:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising