ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Saudi Arabia: ఉపాధి కోసం సౌదీ వెళ్లి.. జైల్లో మృతి చెందిన తెలుగు వ్యక్తి!

ABN, First Publish Date - 2022-09-07T13:18:49+05:30

ఉపాధి కోసం తెలంగాణ నుంచి సౌదీ అరేబియా వెళ్లిన ఓ వ్యక్తి అక్కడి జైలులో మరణించారు. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న భారత ఎంబసీ అధికారులు అతని మృతదేహాన్ని వారి కుటుంబసభ్యులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం మన్నేగూడేనికి చెందిన రాజయ్య కొన్నాళ్ల క్రితం సౌదీ అరేబియా వెళ్లారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి, గల్ఫ్‌ ప్రతినిధి, సెప్టెంబరు 6: ఉపాధి కోసం తెలంగాణ నుంచి సౌదీ అరేబియా వెళ్లిన ఓ వ్యక్తి అక్కడి జైలులో మరణించారు. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న భారత ఎంబసీ అధికారులు అతని మృతదేహాన్ని వారి కుటుంబసభ్యులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం మన్నేగూడేనికి చెందిన రాజయ్య  కొన్నాళ్ల క్రితం సౌదీ అరేబియా వెళ్లారు. రాజయ్య వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉన్నారు. కరోనా అనంతరం పరిస్ధితులు ప్రతికూలంగా మారటంతో తప్పనిసరి పరిస్ధితుల్లో స్వదేశానికి రావాలని అనుకున్నారు. 


ఈ ప్రయత్నంలో ఉండగా వీసా తనీఖీల్లో పోలీసులకు పట్టుబడిన రాజయ్య జైలు పాలయ్యారు. రియాధ్‌లోని డిపోర్టేషన్‌ సెంటర్‌ (విదేశీయుల బహిష్కార కేం ద్రం)లో ఉంటున్న రాజయ్య ఆరోగ్యం దెబ్బతింది. దీంతో రాజయ్యను ఆగస్టు 15న ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే గుండెపోటుతో మరణించారు. మంగళవారం ఆ జైలు సందర్శనకు వచ్చిన భారత ఎంబసీ బృందానికి అక్క డి అధికారులు రాజయ్య గురించి తెలిపారు. దీంతో రాజయ్య మృతదేహాన్ని స్వదేశానికి చేర్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

Updated Date - 2022-09-07T13:18:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising