ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గల్ఫ్ ఎయిర్‌పోర్ట్‌లో చెకింగ్.. టాల్కం పౌడర్‌ను పేపర్లో కట్టుకోవడమే ఆ తెలుగోడి పాలిట శాపమయింది..!

ABN, First Publish Date - 2022-02-17T18:09:31+05:30

ముఖానికి పౌడర్‌ పూసుకునే అలవాటు ఖతర్‌లో తెలంగాణ యువకుడికి పెద్ద కష్టాన్నే తెచ్చిపెట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాల్కం పౌడర్‌ను డ్రగ్స్‌ అనుకొని!

ఖతర్‌లో హైదరాబాద్‌ యువకుడిని అరెస్టు చేసిన అధికారులు 

2 నెలలుగా జైల్లోనే..  

(గల్ఫ్‌ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిది): ముఖానికి పౌడర్‌ పూసుకునే అలవాటు ఖతర్‌లో తెలంగాణ యువకుడికి పెద్ద కష్టాన్నే తెచ్చిపెట్టింది. ప్రయాణంలో అవసరపడుతుందనే ఉద్దేశంతో ఓ పేపర్‌లో కొంత పౌడర్‌ను పొట్లంగా చుట్టుకొని తన బ్యాగ్‌లో వేసుకోవడమే అతడు చేసిన తప్పయింది. విమాశ్రయంలో ఆ పొట్లం విప్పి చూసిన అధికారులు.. తెల్లగా ఉండటంతో డ్రగ్స్‌గా అనుమానించారు. అది ప్రముఖ కంపెనీకి చెందిన టాల్కంపౌండర్‌ అని చెప్పినా వినిపించుకోకుండా అదుపులోకి తీసుకొని జైల్లో పెట్టారు. రెండు నెలలుగా అతడు జైల్లోనే మగ్గుతున్నాడు. బాధితుడు.. హైదరాబాద్‌లోని ఉప్పుగూడ వాస్తవ్యుడైన 29 ఏళ్ల మహ్మద్‌ నవాజ్‌. ఎంబీఏ పూర్తి చేశాడు. ఉద్యోగం సంపాదించుకునేందుకు కొన్నాళ్ల క్రితం దుబాయికి వచ్చాడు. 


ఇంటర్వ్యూకు హాజరయ్యే ముందు తల దువ్వుకునేందుకు ఓ దువ్వెన, పొట్లంలో కొంత పౌడర్‌ను ఎప్పుడూ తన ల్యాప్‌టాప్‌ బ్యాగులో ఉంచుకునేవాడు. రెండు నెలల క్రితం ఖతర్‌కు వెళ్లాడు. అక్కడి విమానాశ్రయంలో అధికారులు బ్యాగ్‌ను తనిఖీ చేశారు. పొట్లంగా చుట్టివున్న టాల్కంపౌడర్‌ను మత్తు పదార్థంగా అనుమానించారు. అది డ్రగ్స్‌ కాదని.. టాల్కంపౌడర్‌ అని నవాజ్‌ వేడుకున్నా వారు వినిపించుకోలేదు. ఆ పౌడర్‌ను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. నవాజ్‌ను పోలీసు కస్టడీకి తరలించారు. నవాజ్‌ను విడుదల చేయించేందుకు అతడి బంధువులు ఖతర్‌ ఎంబసీ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. 

Updated Date - 2022-02-17T18:09:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising