ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

న్యూజెర్సీ తెలుగు కళాసమితి నూతన కార్యవర్గం ఏర్పాటు!

ABN, First Publish Date - 2022-05-27T01:31:39+05:30

న్యూజెర్సీలోని ప్రముఖ తెలుగు సంఘం ‘తెలుగు కళా సమితికి’ మే నెల 12,13 తేదీలలో హోరాహోరీగా జరిగిన ఎన్నికలల్లో అధ్యక్షునిగా మధు రాచకుళ్ళ ఎన్నికయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూజెర్సీ నుండి ఆంధ్రజ్యోతి ప్రతినిధి కిలారు ముద్దుకృష్ణ


న్యూజెర్సీలోని ప్రముఖ తెలుగు సంఘం ‘తెలుగు కళా సమితికి’ మే నెల 12,13  తేదీలలో హోరాహోరీగా జరిగిన ఎన్నికలల్లో అధ్యక్షుడిగా మధు రాచకుళ్ళ ఎన్నికయ్యారు. తన సమీప ప్రత్యర్థి గురు ఆలంపల్లిపై సుమారు 335 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా మధు రాచకుళ్ల మాట్లాడుతూ.. న్యూజెర్సీలో  తెలుగుభాషా సంస్కృతుల పరిరక్షణ, పరివ్యాప్తి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. తనకు ఈ అవకాశం కల్పించిన సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇక.. సీనియర్ ట్రస్టీలుగా రవి కృష్ణ అన్నదానం, బిందు యలమంచిలి, అనూరాధ దాసరి,  శ్రీనివాస్ చెరువు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సుధా దేవులపల్లి,  శ్రీదేవి పులిపాక, జ్యోతి కామరాసు, నాగ మహేందర్ వెలిశాల ట్రస్టీలుగా గెలుపొందారు.  


2022-24 సంవత్సర కాలానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నికల నిర్వహణాధికారి శంకరరావు పోలేపల్లి గారు ప్రకటించారు. అధ్యక్షుడిగా మధు రాచకుళ్ళ, ఉపాధ్యక్షురాలిగా అనూరాధ దాసరి, కార్యదర్శిగా రవి కృష్ణ అన్నదానం, సాంస్కృతిక కార్యదర్శిగా బిందు యలమంచిలి, కోశాధికారిగా శ్రీనివాస్ చెరువు, యువజన కార్యదర్శిగా సుధా దేవులపల్లి, సామాజిక కార్యదర్శిగా శ్రీదేవి పులిపాక, సర్వసభ్య కార్యదర్శిగా జ్యోతి కామరాసు, సాంకేతిక కార్యదర్శిగా నాగ మహేందర్ వెలిశాల మే నెల 18వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు.



Updated Date - 2022-05-27T01:31:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising