ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుబాయిలో తెలుగు ప్రవాసీయుల ఉగాది ఉత్సవం!

ABN, First Publish Date - 2022-04-05T02:09:16+05:30

శ్రీ శుభకృత్ నామ ఉగాది పర్వదినాన్ని గల్ఫ్ దేశాలలో ప్రవాసీయులు ఉత్సహాంగా జరుపుకొంటున్న క్రమంలో భాగంగా దుబాయిలోని తెలుగు అసోసియెషన్ కూడా ఇటీవల ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: శ్రీ శుభకృత్ నామ ఉగాది పర్వదినాన్ని గల్ఫ్ దేశాలలో ప్రవాసీయులు  ఉత్సహాంగా జరుపుకొంటున్న క్రమంలో భాగంగా దుబాయిలోని తెలుగు అసోసియెషన్ కూడా ఇటీవల ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించింది. స్ధానిక శేఖ్ రాషేద్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో నటులు శ్రీకాంత్, ఈషా రెబ్బాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అదే  విధంగా.. గాయని గాయకులు సౌమ్య, సాయిచరణ్‌లతో పాటు స్ధానిక ప్రవాసీయులు కొందరు పాడిన పాటలు కూడా అలరించాయి. 


వివిధ ఎమిరేట్లలో నివసిస్తున్న తెలుగు యువ కళకారులు ప్రదర్శించిన సంప్రదాయ, సినీ నృత్యాలు సభికులను ఆకట్టుకొన్నాయి.  వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 1500 మంది ఈ వేడుకల్లో పాల్గోన్నట్లుగా నిర్వహకులు తెలిపారు. కార్యక్రమానికి  మైథిలి వ్యాఖ్యాతగా వ్యవహరించగా, తెలుగు అసోసియెషన్ ప్రతినిధులు ఉగ్గిన దినేశ్, వి.వి.సురేశ్, బాలుస వివేకానంద, మౌలనా మసీయోద్దీన్, ప్రకాశ్ ఇవటూరి,  సుదర్శన్ కటారు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు జరిగిన క్రికెట్ పోటీలలో విజయం సాధించిన విజేతలకు ఈ సందర్భంగా పురస్కార ప్రదానం జరిగింది. 



Updated Date - 2022-04-05T02:09:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising