ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా తీన్మార్ సంక్రాంతి వేడుకలు!

ABN, First Publish Date - 2022-01-17T00:14:46+05:30

తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో 2022, జనవరి 15న తీన్మార్ సంక్రాంతి-2022 సాంస్కృతిక ఉత్సవాలు కెనడా టొరంటోలో వర్చువల్ విధానంలో ఘనంగా జరిగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో 2022, జనవరి 15న  తీన్మార్ సంక్రాంతి-2022 సాంస్కృతిక ఉత్సవాలు కెనడా టొరంటోలో వర్చువల్ విధానంలో ఘనంగా జరిగాయి. ఈ సంబరాల్లో 200 మందికి పైగా కెనడా తెలంగాణ వాసులు పాల్గొన్నారు. సహాయ కార్యదర్శి శ్రీ జితేందర్, ఆయన సతీమణి కాంతి.. దీప ప్రజ్వలన చేసి తీన్మార్ సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. తెలంగాణ కెనడా అసోసియేషన్ Executive Committee ఆధ్వర్యంలో, Board of Trustee, Foundation Committee సభ్యులు సహకారంతో ఈ సంబరాలు విజయవంతం జరిగాయి. ఈ కార్యక్రమంలో భోగి పళ్ళు, పిల్లలు సంప్రదాయ వేడుకలు, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. 


ముగ్గుల పోటీలకు శ్రీమతి ఉమా సలాడి, శ్రీమతి జయ కందివనం న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇండియా కాన్సుల్టే జనరల్(టొరొంటో) శ్రీమతి అపూర్వ శ్రీవాస్తవ TCA 2022 క్యాలెండరును ఆవిష్కరించి ముగ్గులపోటీలను తిలకించారు. టొరంటోలోని తెలుగు వారికి TCA వారు చేసే కమ్యూనిటీ సర్వీస్‌లను కొనియాడారు. కోవిడ్ నిబంధనలు అతిక్రమించకుండా అందరూ సహకరించి కెనడాలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వర్తించారు. టొరంటో కెనడా తెలంగాణ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజేష్ మాట్లాడుతూ - ఏ దేశ మేగినా ఎందు కాలిడినా మన భారత సాంప్రదాయ పటుత్వాన్ని నెలకొల్పాలని మన తెలుగు సాంప్రదాయ సంరక్షణలో భాగం కావాలని పిలుపునిచ్చారు. 

Updated Date - 2022-01-17T00:14:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising