ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bathukamma: చికాగోలో టీటీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

ABN, First Publish Date - 2022-10-02T15:16:54+05:30

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (Telangana American Telugu Association) ఈ సంవత్సరం బతుకమ్మ పండుగను అక్టోబర్ 1వ తేదీన పవిత్రమైన నవరాత్రి సీజన్‌లో చికాగోలోని పాలటైన్, ఫాల్కన్ పార్క్ రిక్రియేషన్ సెంటర్‌లో ఘనంగా నిర్వహించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చికాగో: తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (Telangana American Telugu Association) ఈ సంవత్సరం బతుకమ్మ పండుగను అక్టోబర్ 1వ తేదీన పవిత్రమైన నవరాత్రి సీజన్‌లో చికాగోలోని పాలటైన్, ఫాల్కన్ పార్క్ రిక్రియేషన్ సెంటర్‌లో ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాలకు చెందిన దాదాపు 500 మందికి పైగా తెలుగువారు పాల్గొన్నారు. పూల పండుగ బతుకమ్మను తెలుగు మహిళలు సంప్రదాయబద్ధంగా, ధూంధాంగా నిర్వహించారు. మంచి ఆరోగ్యం, సంతోషం కోసం బతుకమ్మను స్తుతిస్తూ జానపద పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. ఈ వేడుకలకు వచ్చిన వారందరూ ఎంతో సంతోషంగా గడిపారు. కార్యక్రమం ముగింపులో బతుకమ్మ ఆశీర్వాదం పొందారు. 


అలాగే ఈ ఉత్సవాల సందర్భంగా రుచికరమైన తెలుగింటి భోజనాలను ఏర్పాటు చేశారు. ఈ బతుకమ్మ పండుగను టీటీఏ ప్రెసిడెంట్  హేమచంద్ర వీరపల్లి ఘనంగా నిర్వహించారు. టీటీఏ(TTA) సభ్యులు రామకృష్ణ కొర్రపోలు, హేమంత్ పప్పు, శ్రీనాధ్ వాసిరెడ్డి, ప్రసాద్ మరువాడ, దిలీప్ రాయపూడి, మధు ఆరంబాకం ఆయనకు సహాయ సహకారాలు అందించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో సోమలత, శృతి, శిల్ప, రమేష్, రామాదేవి, రాధికా, సందీప్, లీల ప్రసాద్, నవీన్ కుమార్ ఎంతగానో శ్రమించారు. అలాగే తానా (TANA), IAGC సభ్యులు కూడా పాల్గొన్నారు.



Updated Date - 2022-10-02T15:16:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising