ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్రౌన్ యూనివర్శిటీలోని స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ డీన్‌గా భారతీయ అమెరికన్ ఎంపిక!

ABN, First Publish Date - 2022-01-26T03:13:29+05:30

ప్రఖ్యాత బ్రౌన్ యూనివర్శిటీలోని స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్‌కు డీన్‌గా భారతీయ అమెరికన్ ప్రొఫెసర్ తేజల్ దేశాయ్ ఎంపికయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: ప్రఖ్యాత బ్రౌన్ యూనివర్శిటీలోని స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్‌కు డీన్‌గా భారతీయ అమెరికన్ ప్రొఫెసర్ తేజల్ దేశాయ్ ఎంపికయ్యారు. ప్రస్తుత డీన్ లారెన్స్ లార్సన్ పదవీవిరమణ అనంతరం.. ఈ ఏడాది సెప్టంబర్ 1 నుంచి ప్రొ. దేశాయ్ కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్న డా. దేశాయ్..బ్రౌన్ యూనివర్శిటీ నుంచి బయోమెడికల్ ఇంజినీరింగ్‌లో బీఎస్‌సీ డిగ్రీ పొందారు. వృత్తి జీవితంలో అంచెలంచెలుగా ఎదుగుతూ వివిధ యూనివర్శిటీలు అకడమిక్, పరిశోధన కార్యక్రమాలకు నేతృత్వం వహించారు. తాజా నియామకంతో దేశాయ్.. స్టెమ్(STEM) రంగాలుగా పేరున్న సైన్స్, టెక్, ఇంజినీరింగ్, మ్యా్థ్స్ శాస్త్రవిభాగాల్లో దూసుకుపోతున్న భారత సంతతి నిపుణుల జాబితాలో చోటు సంపాదించారు. మహిళల ప్రాతినిథ్యం తక్కువగా ఉన్న స్టెమ్ రంగాల్లో అత్యున్నత శిఖరాలకు చేరుకున్న అతికొద్ది మంది మహిళల్లో దేశాయ్ కూడా ఒకరు.

Updated Date - 2022-01-26T03:13:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising