ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కువైట్‌లో అంగరంగ వైభవంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

ABN, First Publish Date - 2022-04-21T20:34:09+05:30

తెలుగుదేశం కువైట్ అధ్యక్షుడు కుదరవల్లి సుధాకర రావు ఆధ్వర్యంలో కువైట్‌లో అంగరంగ వైభవంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు జన్మదిన వేడుకలు జరిగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగుదేశం కువైట్ అధ్యక్షుడు కుదరవల్లి సుధాకర రావు ఆధ్వర్యంలో కువైట్‌లో అంగరంగ వైభవంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు జన్మదిన వేడుకలు జరిగాయి. అక్కడి సాల్మియా ఏరియాలో అవంతి ప్యాలస్ హోటల్‌లో ఈ వేడుకలను నిర్వహించారు. బుధవారం పనిదినమైనప్పటికీ ఎంతోమంది అభిమానులు తమ నాయకుడి జన్మదిన వేడుకల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన జూమ్ కాల్‌లో ముఖ్య అతిథులుగా తణుకు మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ, తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత, తెలుగుయువత అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు, NRI TDP సమన్వయ కర్త చప్పిడి రాజశేఖర్, BVR పాల్గొన్నారు. 


ముఖ్య అతిథుల ప్రసంగాలు పార్టీ అభిమానులను ఉత్తేజపరిచాయి. అలాగే  వివిధ గల్ఫ్ దేశాలలోని తెలుగుదేశం పార్టీ నాయకులు..  ఖతారు నుండి సత్యనారాయణ, గొట్టిపాటి వెంకట రమణ, సౌది నుండి రాధాకృష్ణ, నాగ శేఖర్, దుబాయ్ నుండి సింగయ్య, హరీ,  కువైట్ నుండి మద్దిన ఈశ్వర్ నాయుడు, షేక్ భాషా, సుబ్బారెడ్డి, చాన్ భాషా, సంతోష్ తదితరులు కూడా జూమ్ కాల్లో పాల్గొని ప్రసంగించారు. అభిమానులందరూ కలసి కేక్ కట్ చేసి టీడీపీ అధినేత చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు. చంద్రబాబు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని, అందరి దేవుళ్ళ ఆశీస్సులతో  2024లో మరల ముఖ్యమంత్రి అవ్వాలని వారంతా ఆకాంక్షించారు.  

#HBDTrendSetterCBN



Updated Date - 2022-04-21T20:34:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising