ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

US: బే ఏరియాలో మాజీ మంత్రి దేవినేని ఉమ పర్యటన విజయవంతం

ABN, First Publish Date - 2022-09-07T13:39:16+05:30

ఎన్నారై యూఎస్ఏ కోఆర్డినేటర్ జయరాం కోమటి ఆధ్యర్యంలో ప్రవాసాంధ్రులతో మాజీ మంత్రి దేవినేని ఉమ బే ఏరియాలో సమావేశమయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బే ఏరియా: ఎన్నారై యూఎస్ఏ  కోఆర్డినేటర్ జయరాం కోమటి ఆధ్యర్యంలో ప్రవాసాంధ్రులతో మాజీ మంత్రి దేవినేని ఉమ  బే ఏరియాలో సమావేశమయ్యారు. బే ఏరియాలోని ప్రవాసాంధ్రులు, తెలుగుదేశం సభ్యులు పెద్ద సంఖ్యలో ఈ సమావేశానికి హాజరయ్యారు. స్థానిక తెలుగుదేశం నాయకుడు వెంకట్ కోగంటి ఈ కార్యక్రమాన్ని సమన్వయపరిచారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి దేవినేని ఉమ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితులను అందరికి వివరించారు. అనైతికతకు పాల్పడుతున్న ప్రజాప్రతినిధులను ప్రోత్సహిస్తూ ల్యాండ్, శాండ్, వైన్, మైనింగ్ మాఫియా గ్యాంగులను కాపాడే ప్రయత్నంలో ఉన్నారు.  మూడు రాజధానుల ఏర్పాటు అసాధ్యమని తెలిసి పాలన వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని అభూతకల్పనలు, అసత్యాలను చెబుతున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 


ఆంధ్రప్రదేశ్‌ను ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కించే సామర్ధ్యం చంద్రబాబుకే ఉందని ఉమ స్పష్టం చేశారు. రాష్ట్ర మేలు కోసం వచ్చే ఎన్నికల్లో ప్రవాసాంధ్రులు కూడా టీడీపీ విజయానికి సహకరించాలని ఆయన కోరారు. మాజీ టీడీపీ మీడియా, గిడ్డంగుల చైర్మన్ ఎల్వీఎస్ఆర్కే ప్రసాద్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. తెలుగుదేశం నాయకులు శ్రీకాంత్ దొడ్డపనేని, శశి దొప్పలపూడి ఆధ్యర్యంలో స్థానిక వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి రైతులు అవలంబిస్తున్న అధునాతన విధానాలని ఆసక్తిగా తెలుసుకొన్నారు. చివరగా తెలుగుదేశం నాయకుడు భక్త బల్లా వందన సమర్పణ చేసారు. 


ఈ కార్యక్రమంలో చంద్ర గుంటుపల్లి, ప్రసాద్ మంగిన, భరత్ ముప్పిరాల, లీయోన్ రెడ్డి, సుధీర్ ఉన్నం, విజయకృష్ణ గుమ్మడి, శ్రీని వల్లూరిపల్లి, సతీష్ అంబటి, సతీష్ చిలుకూరి, వెంకయ్య జెట్టి, శాస్త్రి వెనిగళ్ల, వీరు ఉప్పల, రమేష్ కొండా, కళ్యాణ్ కట్టమూరి, వెంకట్ అడుసుమల్లి, సుబ్బా యంత్ర, తిరుపతి రావు, బెజవాడ శ్రీను, వీర బాబు, సూర్య, సందీప్ ఇంటూరి తదితరులు  పాల్గొన్నారు.



Updated Date - 2022-09-07T13:39:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising