ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాంచెస్టర్‌లో వైభవంగా టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు!

ABN, First Publish Date - 2022-04-22T01:45:06+05:30

NRI తెలుగుదేశం పార్టీ యూరోప్ TEAM ఆధ్వర్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు జన్మదిన వేడుకలు పలు ఐరోపా నగరాల్లో ఘనంగా జరిగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

NRI తెలుగుదేశం పార్టీ యూరోప్ TEAM ఆధ్వర్యంలో  టీడీపీ అధినేత నారా చంద్రబాబు జన్మదిన వేడుకలు పలు ఐరోపా నగరాల్లో ఘనంగా జరిగాయి. ఎన్నారై టీడీపీ యూరోప్ టీం కిషోర్ చలసాని ఆధ్వర్యంలో నవీన్ సామ్రాట్ జలగడుగు, శ్రీనివాస్ గోగినేని, శ్యామ్ సుందర్ రావు ఊట్ల సమన్వయంతో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కాగా.. బ్రిటన్‌లో మాంచెస్టర్ నగరంలోని టీడీపీ అభిమానులు, పార్టీ కార్యకర్తలు తమ ప్రియతమ నేత పుట్టినరోజు వేడుకలను కేట్ కటింగ్‌తో గొప్పగా నిర్వహించారు.  ఈ సందర్భంగా టీడీపీ మాంచెస్టర్ శాఖ వారు..  దేశ విదేశాల్లో వున్న తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులందరికీ శుభాభినందనలు తెలియజేశారు.


ఈ వేడుకల్లో పాల్గొన్న ఎన్నారైలు.. చంద్రబాబును నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాతగా కొనియాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఒక విజినరీ అని, ఆయన నేటి ఆలోచనలే రేపటి భారతదేశపు ఆచరణలని పేర్కొన్నారు.  విజన్ 2020 పేరుతో భావితరాల కోసం చంద్రబాబు ప్రణాళిక రచించారని తెలిపారు. దేశరాజకీయాల్లోనూ చంద్రబాబు చక్రం తిప్పారని, దళిత వర్గానికి చెందిన నారాయణ్‌ను రాష్ట్రపతిగా ఎంపిక కావడంలో, దక్షిణాదికి చెందిన దేవగౌడ ప్రధాని అవడంలో చంద్రబాబు రాజకీయ వ్యూహా చతురత ఉందని గుర్తు చేసుకున్నారు. 


2024లో ముఖ్యమంత్రి కాబోయేది ఆయనే అని ధీమా వ్యక్తం చేసిన ఎన్నారైలు.. నవ్యాంధ్ర, అమరావతిని నిర్మించేది టీడీపీ అధినేతేనని ఢంకా బజాయించి చెప్పారు. ఆయన హయాంలోనే పోలవరం పూర్తవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు.. ఉమ్మడి ఆంద్రప్రదే‌శ్‌ను, నవ్యాంధ్రప్రదేశ్‌ను చంద్రబాబు  ఎలా అభివృద్ధి చేశారో.. దేశ విదేశాలకు వెళ్లి IT కంపెనీల అధినేతలను ఎలా ఒప్పించి రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చారనే విషయాలను వివరించారు. టీడీపీ అధ్యక్షుడు తమ ఉన్నతికి కారకుడని,  తమలాంటి ఎంతో మందిని తమ కాళ్ళ మీద తాము నిలబడేలా IT ని ప్రోత్సహించి అభివృద్ధి పరిచారని పేర్కొన్నారు. 

Updated Date - 2022-04-22T01:45:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising