ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI TDP Europe టీం ఆధ్వర్యంలో బెల్జియంలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు!

ABN, First Publish Date - 2022-04-21T21:34:56+05:30

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు బెల్జియంలో NRI TDP Europe టీం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు బెల్జియంలో NRI TDP Europe టీం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. NRI తెలుగుదేశం పార్టీ యూరోప్ TEAM కిషోర్ చలసాని ఆధ్వర్యంలో నవీన్ సామ్రాట్ జలగడుగు, శ్రీనివాస్ గోగినేని, అమర్ నాధ్ పొట్లూరి, శివ కృష్ణ (Belgium)  ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నారైలు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగం అభివృద్ధి కోసం చంద్రబాబు చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. టీడీపీ అధినేత నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత అని కొనియాడారు. ఆయన ఆలోచనలే రేపటి భారత దేశపు ఆచరణలని ప్రశంసించారు. తమ ఉన్నతికి కారణమైన, తమలాంటి ఎంతో మందిని తమ కాళ్ళ మీద తాము నిలబడేలా IT ని ప్రోత్సహించి, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసి, వివిధ అభివృద్ధి పథకాలు ప్రవేశ పెట్టి ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌ను అభివృద్ధి బాటన నడిపించారన్నారు. కేక్ కటింగ్ చేసి.. వేడుకలను నిర్వహించారు. 


టీడీపీ బెల్జియం శాఖ వారు.. దేశ విదేశాల్లో ఉన్న తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులందరికీ ఈ సందర్భంగా శుభాభినందనలు తెలియజేశారు. వయసు శరీరానికే గానీ మనసుకి కాదనే మాటని నిజం చేస్తూ, చెదరని చిరునవ్వుతో, బెదరని వ్యక్తిత్వంతో నారా చంద్రబాబు నాయుడు అందరికీ ఆదర్శప్రాయులుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. దార్శనికుడైన చంద్రబాబు అప్పట్లో అమలు చేసిన సంస్కరణల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న అభివృద్ధి ఫలాలని వ్యాఖ్యానించారు. చంద్రబాబు వేసిన బాటలో పయనిస్తూ, ఆయన చెప్పిన మాట అనుసరిస్తూ రానున్న రోజుల్లో పార్టీ మరింత బలోపేతం అవడానికి తమ వంతు కృషి చేస్తామంటూ వారు ప్రతినబూనారు. 

       చంద్రబాబు జన్మదిన వేడుకల వీడియోను ఈ లింక్ ద్వారా చూడగలరు

Updated Date - 2022-04-21T21:34:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising