ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీసీడబ్ల్యూఏ/ఏఐటీఎస్ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా తెలుగు ‘మహాయజ్ఞం’!

ABN, First Publish Date - 2022-01-25T00:26:18+05:30

తెలుగు భాష, సంస్కృతిని ప్రోత్సహించేందుకు తెలుగు కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్(టీసీడబ్ల్యూఏ), ఆల్‌ ఇండియా తెలుగు సేన(ఏఐటీఎస్) సంయక్తంగా ఆన్‌లైన్ ద్వారా జనవరి 16న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు క్లాసులు ప్రారంభించాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగు భాష, సంస్కృతిని ప్రోత్సహించేందుకు తెలుగు కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్(టీసీడబ్ల్యూఏ), ఆల్‌ ఇండియా తెలుగు సేన(ఏఐటీఎస్) సంయక్తంగా ఆన్‌లైన్ ద్వారా జనవరి 16న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు క్లాసులు ప్రారంభించాయి. మహారాష్ట్ర కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న టీసీడబ్ల్యూఏ, ఏఐటీఎస్ సంస్థలు.. వివిధ దేశాలు, రాష్ట్రాల్లోని తెలుగు చిన్నారుల కోసం మహాయజ్ఞం పేరిట ఉచితంగా ఈ తరగతులు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే టీసీడబ్ల్యూఏ/ఏఐటీఎస్ సెంట్రల్ కమిటీ.. అమృత భాష పేరిట ఓ పుస్తకం, మరో వర్క్ బుక్‌ను పీడీఎఫ్ రూపంలో వివిధ దేశాలు, రాష్ట్రాల్లో ఉన్న శాఖల ద్వారా అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు తెలుగు భాషను సులువుగా నేర్చుకుని, సాధన చేసేందుకు అనువుగా వీటిని రూపొందించింది. కాగా.. తెలుగు వారు ఈ ‘మహాయజ్ఞం’లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారత్‌లోని తొమ్మిది రాష్ట్రాలతో పాటూ వివిధ దేశాల్లో ఉంటున్న దాదాపు 900 మంది తమ పిల్లల్ని ఈ కార్యక్రమంలో చేర్పించారు. 


ఈ మహాజ్ఞనం ప్రారంభమైన రోజును ఇకపై ప్రతిఏటా తెలుగు క్లాసుల ప్రారంభదినోత్సవంగా జరుపుకోవాలని టీసీడబ్ల్యూఏ, ఏఐటీఎస్ నిర్ణయించాయి. కాగా.. ఈ కార్యక్రమం ప్రారంభవేడుకలో పాల్గొన్న ఏఐటీఎస్ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు పీఎస్ఎన్ మూర్తి, టీసీడబ్ల్యూఏ మధ్యప్రదేశ్ శాఖ ప్రెసిడెంట్, అమృత భాష పున్తక రచయిత ఆర్‌వీఎస్ఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ వేడుక ఘనంగా జరిగిందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు కృషి చేసిన వారందరినీ అభినందించారు. వివిధ ప్రాంతాల్లో టీసీడబ్ల్యూఏ చేపడుతున్న కార్యక్రమాల పర్యవేక్షణ కోసం పీఎస్ఎన్ మూర్తి, ఆర్వీఎస్ఎస్ ఆధ్వర్యంలో వివిధ స్థాయిల్లో కమిటీలు ఏర్పాటయ్యాయి.

Updated Date - 2022-01-25T00:26:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising