ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అట్లాంటాలో ATA ఆధ్వర్యంలో సయ్యంది పాదం, అందాల పోటీలు

ABN, First Publish Date - 2022-06-16T17:35:04+05:30

అట్లాంటా నగరంలో జూన్ 15వ తేదీన ఆటా సయ్యంది పాదం డ్యాన్స్ కంపెటిషన్లు మరియు ఆటా వారి అందాల పోటీలు జరిగాయి. 25 పైగా డ్యాన్స్ గ్రూప్స్ ఈ పోటీలలో పాలుపంచుకున్నాయి.. సయ్యంది పాదం నిర్వహణ బాధ్యతలు బాలు వళ్లు, శ్వేతా పర్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: అట్లాంటా నగరంలో జూన్ 15వ తేదీన ఆటా సయ్యంది పాదం డ్యాన్స్ కంపెటిషన్లు మరియు ఆటా వారి అందాల పోటీలు జరిగాయి. 25 పైగా డ్యాన్స్ గ్రూప్స్ ఈ పోటీలలో పాలుపంచుకున్నాయి.. సయ్యంది పాదం నిర్వహణ బాధ్యతలు బాలు వళ్లు, శ్వేతా పర్యవేక్షించారు. అందాల పోటీల నిర్వహణలో శ్రావణి రాచకుల్లా,  మల్లికా దుంపల, శృతి చితూరీ మరియు ఉదయ ఏటూరి చురుకైన పాత్ర పోషించారు.  


ఎంతో వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ సెగ్మెంట్స్ క్లాసికల్ మరియు నాన్-క్లాసికల్ విభాగాలలో టీన్స్, మిస్, మిస్సెస్ పోటీలలో చాలా మంది మహిళలు పాల్గొని సందడి చేసారు.

  జ్యోతి ప్రజ్వలన అనంతరం శ్రీరామ శ్రీనివాస్ ఆటా అట్లాంటా టీంని సభకు పరిచయం చేసారు. ట్రస్టీ అనిల్ బొద్దిరెడ్డి ఆటా నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలు, ఆట మెంబెర్ బెనిఫిట్స్ గురించి సభకు వివరించారు. ఆటా పూర్వ ప్రెసిడెంట్ కరుణాకర్ అసిరెడ్డి,  కో-కోర్డినేటర్ కిరణ్ పాశం, ఆటా కాన్ఫరెన్స్ అడ్వైసర్ గౌతమ్ గోలి, ట్రస్టీస్ అనిల్ బొద్దిరెడ్డి, వేణు పిసికే మరియు ప్రశీల్ రెడ్డి. ఆటా నేషనల్ కమిటీ చైర్ వెంకట్ వీరనేని, నిరంజన్ పొద్దుటూరి, జయ చందా, తిరుమల  పిట్టా, శ్రీనివాస్ ఉడతా మరియు ఉమేష్ ముత్యాల పాల్గొన్నారు.  



ఆటా 17వ మహా సభలలో విరివిగా పాల్గొనాల్సిందిగా కో-కోర్డినేటర్ కిరణ్ పాశం, ఆటా పూర్వ ప్రెసిడెంట్ కరుణాకర్ అసిరెడ్డి , గౌతమ్ గోలి పిలుపునిచ్చారు. పలు పోటీల్లో అత్యద్భుత ప్రతిభా పాటవాలు ప్రదర్శించిన వారికి లీడర్షిప్ టీం ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసింది. కార్యక్రమంలో పాల్గొన్న వారికి మొమెంటోస్ అందచేశారు. విజేతలు వాషింగ్టన్ డీసీ కార్యకరంలో పాల్గొననున్నారు. ATA కాన్ఫరెన్స్ కో-కోర్డినేటర్ కిరణ్ పాశం మాట్లాడుతూ.. కార్యక్రమం విజయవంతం కావడానికి తోడ్పడ్డ వారికి ధన్యవాదాలు తెలిపారు. నిర్వాహకులు సయ్యంది పాదం చైర్ సుధా కొండెపు,  అడ్వైజర్ రామకృష్ణ అలె, కో చైర్స్  భాను, రాంరాజ్, అందాల పోటీలు చైర్ నీహారిక నవల్గాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.


Updated Date - 2022-06-16T17:35:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising