తెలుగువారి అభ్యున్నతి కోసం ‘తమిళనాడు తెలుగు పీపుల్ ఫౌండేషన్’ విశేష కృషి!
ABN, First Publish Date - 2022-04-28T22:25:32+05:30
వివిధ కారణాల రీత్యా మాతృభూమిని వీడి పరాయి ప్రాంతాలకు వలసపోయిన తెలుగువారికి సేవ చేసేందుకు ఇప్పటికే అనేక తెలుగు సంఘాలు ఉనికిలో ఉన్న విషయం తెలిసిందే. అయితే.. తమిళనాడులోనూ ‘తమళనాడు తెలుగు పీపుల్ షౌండేషన్’ పేరిట ఓ సంఘం తెలుగుప్రజల అభ్యున్నతి కోసం ఐదేళ్లుగా విశేష కృషి చేస్తోంది.
వివిధ కారణాల రీత్యా మాతృభూమిని వీడి పరాయి ప్రాంతాలకు వలసపోయిన తెలుగువారికి సేవ చేసేందుకు ఇప్పటికే అనేక తెలుగు సంఘాలు ఉనికిలో ఉన్న విషయం తెలిసిందే. అయితే.. తమిళనాడులోనూ ‘తమిళనాడు తెలుగు పీపుల్ షౌండేషన్’ పేరిట ఓ సంఘం తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం ఐదేళ్లుగా విశేష కృషి చేస్తోంది. తెలుగు వారందరికీ ఓ వేదిక ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యంతో ఈ ఫౌండేషన్‌ను నెలకొల్పినట్టు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజు దేవరకొండ తెలిపారు. ఐదేళ్లుగా తాము తమిళనాడులోని తెలుగు ప్రజల కోసం వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అయితే.. రెండేళ్ల క్రితమే సంస్థను అధికారికంగా రిజిస్టర్ చేసినట్టు తెలిపారు.
కరోనా సంక్షోభసమయంలోనూ తెలుగు ప్రజలకు ప్రయోజనం చేకూరేలా అనేక కార్యక్రమాలు చేసినట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా తరువాత తెలుగు ప్రజలు అధికంగా ఉండే ప్రాంతం చెన్నైయేనని తెలిపిన ఆయన.. ఆ నగరం పట్ల తెలుగు ప్రజలకు అభిమానం ఉందని వ్యాఖ్యానించారు. కుల, మతాలకు అతీతంగా ఈ వేదికను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఈ సంస్థలో ఐపీఎస్‌లతో పాటూ మరెందరో వృత్తినిపుణులు సభ్యులుగా ఉన్నట్టు తెలిపారు. తెలుగు మాతృభాష అయిన వారందరి కోసం ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేశామని రాజు దేవరకొండ తెలిపారు. సంస్థ చేపడుతున్న కార్యక్రమాల వివరాల కోసం https://www.tntpf.com ను సందర్శించాలని కోరారు.
Updated Date - 2022-04-28T22:25:32+05:30 IST