ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హిజాబ్ ధరించండి.. మహిళలకు తాలిబన్ల ఆదేశాలు

ABN, First Publish Date - 2022-01-09T02:48:04+05:30

మహిళలు కచ్చితంగా హిజాబ్ ధరించాలంటూ రాసున్న పోస్టర్లను తాలిబన్లు కాబూల్ నగర వీధుల్లో ఏర్పాటు చేశారు. కేఫ్‌లు, రెస్టారెంట్ల వద్ద కూడా ఈ పోస్టర్లు దర్శనమిచ్చాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: మహిళలు కచ్చితంగా హిజాబ్ ధరించాలంటూ రాసున్న పోస్టర్లను తాలిబన్లు కాబూల్ నగర వీధుల్లో ఏర్పాటు చేశారు. కేఫ్‌లు, రెస్టారెంట్ల వద్ద కూడా ఈ పోస్టర్లు దర్శనమిచ్చాయి. ‘‘షరియా చట్టం ప్రకారం.. ముస్లిం మహిళలు తప్పనిసరిగా హిజాబ్ ధరించాలి’’ అని పోస్టర్లపై రాసుంది. కాగా.. ప్రభుత్వమే ఈ పోస్టర్లను ఏర్పాటు చేసిందని తాలిబన్ల ప్రతినిధి స్థానిక మీడియాకు స్పష్టం చేశారు. అయితే.. ఈ నిబంధన పాటించని వారిపై కఠిన శిక్షలు విధించబోమని కూడా భరోసా ఇచ్చారు. ‘‘హిజాబ్ ధరించని వారికి శిక్షలు వేస్తామని అర్థం కాదు. హిజాబ్ వేసుకోవాలని మహిళలను ప్రోత్సహించేందుకే ఈ పోస్టర్లను ఏర్పాటు చేశాం’’ అని ఆయన పేర్కొన్నారు. అయితే.. మహిళలను భయభ్రాంతులను గురి చేసేందుకు ఇలాంటి పోస్టర్లు వెలిశాయని స్థానిక యూనివర్శిటీల్లో చదువుతున్న విద్యార్థినులు కొందరు అభిప్రాయపడ్డారు. 

Updated Date - 2022-01-09T02:48:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising