ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికా 2024 అధ్యక్ష ఎన్నికల బరిలో భారతీయుడు.. !

ABN, First Publish Date - 2022-03-21T01:54:07+05:30

అమెరికా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు.. భారతీయ సంతతి మహిళ! ఇది అందరికీ తెలిసిందే. మరి అమెరికాలో భారతీయ మూలాలున్న వారు అందుకోగలిగిన అత్యున్నత అధికార పీఠం ఇదేనా..? అంటే కానే కాదంటున్నాయి అమెరికాలోని తాజాగా పరిణామాలు. అగ్రరాజ్యంలో అన్ని రంగాల్లో దూసుకుపోతున్న భారతీయులకు త్వరలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: అమెరికా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు.. భారతీయ సంతతి మహిళ! ఇది అందరికీ తెలిసిందే. మరి అమెరికాలో భారతీయ మూలాలున్న వారు అందుకోగలిగిన అత్యున్నత అధికార పీఠం ఇదేనా..? అంటే కానే కాదంటున్నాయి అమెరికాలోని తాజాగా పరిణామాలు. అగ్రరాజ్యంలో అన్ని రంగాల్లో దూసుకుపోతున్న భారతీయులకు త్వరలో అధ్యక్ష పీఠం కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత ప్రెసిడెంట్ బైడెన్ రేసు నుంచి తప్పుకునే పక్షంలో.. డెమోక్రెటిక్ పార్టీ సభ్యుడు భారతీయ సంతతికి చెందిన రో ఖన్నాను పోటీలో నిలపాలని ఆ పార్టీలో అధిక శాతం మంది భావిస్తున్నారు.


ప్రముఖ నేత బెర్నీ శాండర్స్ తరుఫున గత ఎన్నికల్లో ప్రచారం చేసిన ముఖ్య నేతలందరూ రో ఖన్నాకు మద్దుతు పలుకుతున్నట్టు సమాచారం. దీంతో.. పార్టీ పెద్దలంతా రో వెంటే ఉన్నట్టైందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.  గత ఎన్నికల్లో బెర్నీ శాండర్స్‌కు సలహాదారుగా పనిచేసిన మార్క్ లాంగబో, ప్రచార కమిటీ మేనేజర్ జెఫ్ వీవర్ ఇప్పటికే రో ఖన్నాను అధ్యక్ష పోటీలో దిగారని కోరారట. అయితే.. వచ్చే ఎన్నికల రేసులో తాను ఉంటానో లేదో అనే అంశంలో ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ ఇవ్వని కారణంగా పార్టీ నేతలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కానీ.. బైడెన్ తప్పుకున్న పక్షంలో రో ఖన్నాకే తమ మద్దతు అని ఆంతరంగిక సంభాషణల్లో స్పష్టంగానే చెబుతున్నారు. 


ప్రస్తుతం బైడెన్ వయసు 79 ఏళ్లు. దీంతో.. వచ్చే ఎన్నికల్లో ఆయన నిలబడే అవకాశం తక్కువనే అధిక శాతం మంది భావిస్తున్నారు. డెమాక్రెటిక్ పార్టీ గవర్నర్లు, సెనెటర్లు, అమెరికా ప్రతినిధుల సభ సభ్యుల్లో చాలా వరకూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే.. వచ్చే ఎన్నికల్లోనూ బైడెన్‌కు మద్దతు ఇస్తానన్న రో ఖన్నా..ఆయన తప్పుకునే పక్షంలో ఎన్నికల్లో దిగేందుకు ఉద్దండులైన అనేక మంది నాయకులు ఉన్నారని చెప్పుకొచ్చారు. తాను పోటీలో ఉండబోనని మాత్రం పేర్కొనలేదు. రో ఖన్నా తనని తాను అభ్యుదయ కాపిటలిస్టు‌గా అభివర్ణించుకుంటారు.


ప్రస్తుతం అమెరికాలోని తీర ప్రాంత రాష్ట్రాలకే పరిమితమైన సంపద సృష్టిని అన్ని ప్రాంతాలకు విస్తరించడమే తన అభిమతమని చెబుతారు. అంతేకాకుండా...సిలికాన్ వ్యాలీలోనూ రో ఖన్నాకు మద్దతు ఇచ్చేవారు బోలెడంత మంది ఉన్నారు. అమెరికాకు వలసొచ్చిన వారి సంతానమైన రో ఖన్నాకు.. శ్వేతజాతీయేతరుల నుంచి మద్దతు కచ్చితంగా ఉంటుందని ఆయన సపోర్టర్లు నమ్మకంగా చెబుతున్నారు. ఇండియన్ అమెరికన్ వర్గం ఆర్థిక శక్తి కూడా ఆయన వెంటే ఉంటుందని భావిస్తున్నారు. అయితే.. అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగని పక్షంలో రో ఖన్నా సెనెటర్‌ ఎన్నికల బరిలోకి కూడా దిగొచ్చని ఆయన్ను బాగా గమనించే వారు చెప్పే మాట.       

Updated Date - 2022-03-21T01:54:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising