ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Study in Saudi Arabia: 160 దేశాల విద్యార్థులే లక్ష్యంగా సౌదీ ప్రత్యేక ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్‌

ABN, First Publish Date - 2022-09-30T16:40:22+05:30

సౌదీ అరేబియా విదేశీ విద్యార్థుల (Foreign students) కోసం 'స్టడీ ఇన్ సౌదీ అరేబియా' (Study in Saudi Arabia) పేరిట ప్రత్యేక ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రియాద్: సౌదీ అరేబియా విదేశీ విద్యార్థుల (Foreign students) కోసం 'స్టడీ ఇన్ సౌదీ అరేబియా' (Study in Saudi Arabia) పేరిట ప్రత్యేక ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమాన్ని 160 దేశాల విద్యార్థులు, పరిశోధకులే లక్ష్యంగా తీసుకువస్తున్నట్లు ఈ సందర్భంగా ఆ దేశ మంత్రిమండలి వెల్లడించింది. దీనికోసం స్పాన్సర్స్ అవసరం లేకుండానే ఎడ్యుకేషనల్ వీసాలు (Educational visas) ఇస్తామని సౌదీ మంత్రిమండలి ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా మంగళవారం ఆ దేశ కేబినెట్ కొత్త విద్యా వీసాలను ప్రవేశపెట్టింది. వీటిలో దీర్ఘకాలిక వీసాలను విద్యార్థులు, పరిశోధకులు, నిపుణులకు ఇవ్వనున్నారు. విద్యా ప్రయోజనాల కోసం కొత్త వీసాల జారీలో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఈ సందర్భంగా మంత్రిమండలి వెల్లడించింది. మంగళవారం రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ (King Salman) అధ్యక్షతన జరిగిన కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 


ఇక స్వల్పకాలిక వీసాలను విద్యార్థులు, పరిశోధకులు, విజిటింగ్ ట్రైనీలకు భాషా అధ్యయనం, శిక్షణ, షార్ట్ ప్రోగ్రామ్‌లలో పాల్గొనడంతో పాటు విద్యార్థి మార్పిడి కార్యక్రమాల ప్రయోజనాల కోసం మంజూరు చేయడం జరుగుతుందని మంత్రిమండలి ప్రకటించింది. ఇదిలాఉంటే.. సుమారు 13 మిలియన్ల మంది ప్రవాసులు(Expats) ఉన్న సౌదీ అరేబియా (Saudi Arabia)లో పని చేయాలనుకునే విదేశీయుడి ప్రవేశానికి సౌదీ స్పాన్సర్ తప్పనిసరి. అయితే, కాంట్రాక్టు నిబంధనలను మెరుగుపరిచే ఉద్దేశంతో 2021లో చాలా వృత్తులవారికి ఆ షరతును కింగ్‌డమ్ (Kingdom) క్యాన్సిల్ చేసింది.

Updated Date - 2022-09-30T16:40:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising