ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆన్‌లైన్‌ చేసిన చిన్న తప్పు.. ఈ NRI కొంప ముంచింది

ABN, First Publish Date - 2022-03-07T22:06:06+05:30

ఆయన ఒక ఎన్నారై. అగ్రరాజ్యం అమెరికాలో ఉన్నత చదువులు చదువుతున్నాడు. కొద్ది రోజుల క్రితమే తల్లిదండ్రుల దగ్గరకు వచ్చాడు. ఈ క్రమంలో ఆన్‌లైన్‌లో అతడు ఓ చిన్న పొరపాటు చేశాడు. ఫలితంగా భారీ మొ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ఆయన ఒక ఎన్నారై. అగ్రరాజ్యం అమెరికాలో ఉన్నత చదువులు చదువుతున్నాడు. కొద్ది రోజుల క్రితమే తల్లిదండ్రుల దగ్గరకు వచ్చాడు. ఈ క్రమంలో ఆన్‌లైన్‌లో అతడు ఓ చిన్న పొరపాటు చేశాడు. ఫలితంగా భారీ మొత్తంలో నష్టపోయాడు. దీంతో పోలీసులను ఆశ్రయించాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



ముంబైలోని పోవై ప్రాంతానికి చెందిన రాహుల్ సింగ్(పేరు మార్చడం జరిగింది) అనే వ్యక్తి ఉన్నత చదువుల కోసం కొన్నేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. తల్లిదండ్రులను చూసేందుకు రెండు నెలల క్రితమే ఇండియాకు తిరిగొచ్చాడు. ఈ క్రమంలోనే తాజాగా రాహుల్ సింగ్.. సరదాగా ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకోవాలని ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగా  వైన్‌షాప్‌కు వెళ్లి మద్యం బాటిళ్లు తెచ్చుకోకుండా ఆన్‌లైన్‌ను ఆశ్రయించాడు. వైన్‌షాప్ ఫోన్ నెంబర్ కోసం ఇంటర్నెట్‌లో సర్చ్ చేశాడు. తర్వాత ఓ నెంబర్‌కు కాల్ చేసి, బ్యాంక్ వివరాలను అన్నింటిని ఇచ్చేసి రూ.786 విలువైన ఆరు మద్యం బాటిళ్లను ఆర్డర్ చేశాడు. కొద్ది సమయం తర్వాత ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌లు చూసి షాకయ్యాడు. విడుతల వారీగా తన ఎన్నారై అకౌంట్ ఖాతా నుంచి రూ.2.5లక్షలు కట్ కావడంతో కంగుతిన్నాడు. చివరికి తాను మోసపోయినట్టు గ్రహించి, పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. 




Updated Date - 2022-03-07T22:06:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising