ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం

ABN, First Publish Date - 2022-04-14T00:21:20+05:30

అగ్రరాజ్యం అమెరికాలో శ్రీ సీతారాముల వారి కళ్యాణం ఘనంగా జరిగింది. గత ఆరు సంవత్సరాలుగా లాస్ ఏంజెల్స్ పరిసర ప్రాంతాల్లోని ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలుగు ప్రజలు ఈ వేడుకులను నిర్వహి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలో శ్రీ సీతారాముల వారి కళ్యాణం ఘనంగా జరిగింది. గత ఆరు సంవత్సరాలుగా లాస్ ఏంజెల్స్ పరిసర ప్రాంతాల్లోని ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలుగు ప్రజలు ఈ వేడుకులను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 10న స్థానికంగా ఉన్న ఇండియన్ కమ్యూనిటీ సెంటర్‌లో జరిగిన ఈ ఉత్సవం.. భద్రాచల రాముల వారి కళ్యాణమహోత్సవాన్ని తలపించింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కళ్యాణ మహోత్సవ వేడుకలు.. మధ్యాహ్నం పెళ్లి వింధు భోజనంతో ముగిశాయి. భద్రాచంలో ప్రత్యేక పూజలు చేయించుకుని అమెరికాకు తీసుకొచ్చిన ఉత్సవ మూర్తులతో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాంగణం అంతా గోవింద, రామ నామాలతో మారుమోగిపోయింది. ఇదిలా ఉంటే.. ఊరేగింపు నేపథ్యంలో సుమారు 50 మంది మహిళలతో  ఏర్పాటు చేసిన కోలాటం భక్తులను ఆకట్టుకుంది. సీతారాముల కాళ్యానికి సుమారు 700 మంది భక్తులు హాజరు కాగా.. దాదాపు అందరూ సంప్రదాయబద్ధంగా తయారై వొచ్చారు. 



ఈ సామూహిక కాళ్యాణ వేడుకలో సుమారు 70 జంటలు పాల్గొన్నాయి. రాముల వారికి, సీతమ్మ వారికి భక్తులందరూ కలిసి పట్ట వస్త్రాలు, బంగారు తాళిబొట్టు, మెట్టలు, ఆభరణాలు, ముత్యాల తలంభ్రాలు సమర్పించుకున్నారు. కాగా.. ఏ సంస్థలతో సంబంధం లేకుండా తెలుగు వారంతా కలిసి శ్రీ సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించడం అభినందించదగ్గ విషయం. కాగా.. నిర్వాహకులు రామ్ కొడితాల, చందు నంగినేని, కుమార్ తాలింకి, మనోహరల్ ఎడ్మా తదితరులు మాట్లాడుతూ.. సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను భవిష్యత్తు తరాల వారికి నేర్పించే క్రమంలో గత 6ఏళ్లుగా శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా జరిపిస్తున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వలంటీర్లు, భక్తులు, దాతలకు ధన్యవాదాలు తెలిపారు. 






Updated Date - 2022-04-14T00:21:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising