ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అలా కూడబెట్టిన డబ్బుతో.. సొంతింటి కల సాకారం చేసుకుంటున్న ప్రవాసీల కుటుంబాలు!

ABN, First Publish Date - 2022-04-25T12:36:24+05:30

గల్ఫ్‌ వలసలకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పెట్టింది పేరు. పొట్ట చేతపట్టుకుని ఇక్కడి నుంచి అనేక మంది దుబాయ్‌, సౌదీ అరేబియా, కువైట్‌, ఒమన్‌, ఖతర్‌ తదితర దేశాలకు వెళుతుంటారు. కుటుంబాలకు దూరంగా కష్టపడి పనిచేస్తూ.. వచ్చిన అంతో కొంతో సొమ్మును మాతృదేశంలోని రక్త సంబంధీకు పంపిస్తుంటారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాతృ భూమిలో సొంతింటి కల సాకారం

బొమ్మకల్‌లో ఇళ్లు కట్టుకుంటున్న గల్ఫ్‌ కార్మికులు

పంచాయతీ పరిధిలో ఆకట్టుకునేలా నిర్మాణాలు

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి): గల్ఫ్‌ వలసలకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పెట్టింది పేరు. పొట్ట చేతపట్టుకుని ఇక్కడి నుంచి అనేక మంది దుబాయ్‌, సౌదీ అరేబియా, కువైట్‌, ఒమన్‌, ఖతర్‌ తదితర దేశాలకు వెళుతుంటారు. కుటుంబాలకు దూరంగా కష్టపడి పనిచేస్తూ.. వచ్చిన అంతో కొంతో సొమ్మును మాతృదేశంలోని రక్త సంబంధీకులకు పంపిస్తుంటారు. అలా కూడబెట్టిన డబ్బులతో ప్రవాసీల కుటుంబాలు కరీంనగర్‌ శివారులో సొంతింటి కలను సాకారం చేసుకుంటున్నాయి. రాజీవ్‌ రహదారిపై కరీంనగర్‌ను ఆనుకుని ఉన్న బొమ్మకల్‌ గ్రామంలో ప్రవాసీలు నిర్మిస్తున్న గృహాలు పలువురిని ఆకట్టుకుంటున్నాయి. ఈ గ్రామ పంచాయితీ పరిధిలోని సిరిపురం, విజయా నగర్‌, సిటిజన్‌ కాలనీ, రజ్వీ చమాన్‌ ప్రాంతాల్లో గల్ఫ్‌ వెళ్లిన ప్రవాసీల కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవలి కాలంలో ప్రవాసీలు నిర్మించిన ఇళ్లతో ఈ కాలనీల రూపురేఖలు మారిపోయాయి. 


దీంతో సింగరేణి, ఎన్టీపీసీలో పని చేసి పదవీ విరమణ పొందిన అనేక మంది ఇక్కడ స్థిరపడటానికి ఆసక్తి చూపుతున్నారు. కాలుష్యం, నగర యాంత్రిక జీవనానికి దూరంగా.. ప్రశాంతత కోసం ఇక్కడకు వచ్చి స్థిరపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. ఈ గ్రామ పంచాయతీ పరిధిలో రోజూ సగటున మూడు నుంచి నాలుగు భవనాల నిర్మాణాల కోసం దరఖాస్తు చేసుకుంటుండగా.. అన్నీ సక్రమంగా ఉంటే 72 గంటలలోపే అనుమతులు వస్తున్నాయి. చిన్న గ్రామమైనా మునిసిపల్‌ కార్పొరేషన్‌ కంటే వేగంగా అనుమతులు ఇస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు పెరుగుతున్న జనావాసాలకు తగినట్లుగా పంచాయతీ పరిధిలో కనీస మౌలిక సదుపాయాలైన రహదారులు, మురుగు కాలువల నిర్మాణం జరగడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు. 



వర్షాకాలం వస్తే దారులన్నీ జలమయమవుతున్నాయని, దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పేర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా విదేశీ మారకం అందుతున్న ప్రాంతాల్లో ఒకటయినప్పకీ స్థానికంగా బ్యాంకింగ్‌ సేవలు పూర్తిగా వెనకబడ్డాయి. కనీసం ఎటీఎంలు కూడ ఆశించిన విధంగా అందుబాటులో లేవు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్‌వాడీ కేంద్రాలు లేవు. గ్రామ పంచాయితీ కార్యాలయం అత్యంత దయనీయ స్ధితిలో ఉంది. జనావాసాలు పెరిగిపోతున్న ఈ ప్రాంతంలో ప్రణాళికబద్ధంగా అభివృద్ధి పనులు చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.




Updated Date - 2022-04-25T12:36:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising