ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కువైత్‌లో అనూహ్య పరిణామం.. భారీగా తగ్గిన 60ఏళ్లకు పైబడిన ప్రవాసుల సంఖ్య!

ABN, First Publish Date - 2022-04-24T17:10:18+05:30

కువైత్‌లో 60 ఏళ్లకు పైబడిన ప్రవాసుల విషయంలో సుమారు ఏడాది పాటు గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: కువైత్‌లో 60 ఏళ్లకు పైబడిన ప్రవాసుల విషయంలో సుమారు ఏడాది పాటు గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. మొదట అసలు ఈ కేటగిరీ ప్రవాసుల వర్క్ పర్మిట్లు రెన్యూవల్ చేకూడదని నిర్ణయించిన కువైత్.. ఆ తర్వాత వెనక్కి తగ్గింది. పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్(పీఏఎం) ఈ కేటగిరీ ప్రవాసుల వర్క్ పర్మిట్లను పునరుద్ధరించకూడదని తీసుకున్న నిర్ణయాన్ని ఆ దేశ మంత్రి మండలికి చెందిన ఫత్వా, లెజిస్లేషన్ విభాగం రద్దు చేసింది. దాంతో ఇటీవలే మళ్లీ వారికి వర్క్ పర్మిట్లు రెన్యూవల్ చేయడం ప్రారంభించింది. ఇదిలాఉంటే.. తాజాగా వెలువడిన గణాంకాల ప్రకారం కువైత్‌లో 60 ఏళ్లు దాటిన ప్రవాసుల సంఖ్య ఏడాది వ్యవధిలోనే 8శాతం(6,533) మేర తగ్గినట్లు తెలుస్తోంది.


2020 చివరి నాటికి ఈ కేటగిరీ ప్రవాసులు 81,500 మంది ఉంటే.. 2021 చివరికి వచ్చేసరికి 74,900కు పడిపోయింది. ఇక 64 ఏళ్లకు పైబడిన వలసదారుల సంఖ్య ఇదే ఏడాది వ్యవధిలో 4,317 తగ్గింది. 2020లో 48,580గా ఉన్న ఈ సంఖ్య 2021 చివరి నాటికి 44,270కు పడిపోయింది. అలాగే 65ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న ప్రవాసుల సంఖ్య 2,216 తగ్గింది. 2020 చివరిలో 32,930గా ఉన్న సంఖ్య 2021 చివరి నాటికి 30,720కు తగ్గింది. ఇక కువైత్ సర్కార్ కువైటైజేషన్ పాలసీ అమలులో భాగంగా తీసుకుంటున్న కఠిన నిర్ణయాల కారణంగా కూడా భారీ మొత్తంలో ప్రవాసులు ఆ దేశాన్ని వీడుతున్న సంగతి తెలిసిందే.  

Updated Date - 2022-04-24T17:10:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising