ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

UAE residence visas: 6నెలలకు మించి యూఏఈ బయట ఉన్నాసరే.. ఈ వీసాల వాలిడిటీకి ఢోకా లేదు.. అవేంటో ఓ లుక్కేయండి!

ABN, First Publish Date - 2022-07-31T17:14:21+05:30

ఒకవేళ మీరు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) రెసిడెన్సీ వీసా (Residence visa) కలిగి ఉండి.. ఆ దేశం బయట ఆరు నెలల దాటి ఉన్నారంటే ఆటోమెటిక్ దాన్ని వాలిడిటీ రద్దు అవుతుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ఒకవేళ మీరు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) రెసిడెన్సీ వీసా (Residence visa) కలిగి ఉండి.. ఆ దేశం బయట ఆరు నెలల దాటి ఉన్నారంటే ఆటోమెటిక్ దాన్ని వాలిడిటీ రద్దు అవుతుంది. అప్పుడు మీరు తిరిగి ఆ దేశంలోకి ప్రవేశించాలంటే తప్పనిసరిగా కొత్త ఎంట్రీ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందే. అయితే, కొన్ని సందర్భాల్లో ఈ నిబంధనకు మినహాయింపులు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం చుద్దాం. 


ఈ ఏడాది ఏప్రిల్ 18న యూఏఈ ప్రభుత్వం తన దీర్ఘకాలిక రెసిడెన్సీ వీసా అయిన గోల్డెన్ వీసా (Golden Visa) రెసిడెన్సీ పథకంలో కీలక సవరణలు చేసింది. గోల్డెన్ వీసాదారులకు ఆ దేశం బయట 6నెలలకు మించి ఉండరాదు అనే నిబంధనను తొలగించింది. గోల్డెన్ వీసా చెల్లుబాటు అయ్యేంతవరకు వీసాదారులు యూఏఈ బయట ఎంతకాలం ఉన్నాసరే ఎలాంటి ఎంట్రీ పర్మిట్ల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. నేరుగా ఎంట్రీకి వీలుటుంది. గోల్డెన్ వీసాదారులతో పాటు మరికొన్ని కేటగిరీలకు చెందిన రెసిడెన్సీ వీసా హోల్డర్లకు కూడా ఈ నింబంధన నుంచి మినహాయింపు ఉంది.


వాటిలో ఎమిరటీ పౌరుడిని పెళ్లాడిన విదేశీ మహిళకు ఇది వర్తిస్తుంది. బయటి దేశాల్లో ఎన్నిరోజుల ఉన్నాసరే.. భర్త స్పాన్సర్షిప్‌పై ఆమె ఎప్పుడైన యూఏఈ వెళ్లే వెసులుబాటు ఉంది. ఇక చదువులు లేదా వైద్య చికిత్స కోసం ఎమిరాటీస్‌తో పాటు బయటి దేశాలకు వెళ్లే గృహ సహాయకులకు (Domestic helpers) సైతం ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంది. అలాగే విదేశాలలో యూఏఈ (UAE)కి ప్రాతినిధ్యం వహిస్తున్న దౌత్య, కాన్సులర్ మిషన్‌ల సభ్యులతో పాటు ఉండే డొమెస్టిక్ హెల్పర్లు (Domestic helpers), యూఏఈలో నివాస వీసాలు కలిగి ఉన్న అటువంటి మిషన్ ఉద్యోగులకు కూడా ఇది వర్తిస్తుంది.


పబ్లిక్ సెక్టార్‌లో పనిచేస్తున్న ప్రవాసులను వారి యజమానులు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు, స్పెషల్ కోర్సుల కోసం విదేశాలకు పంపిస్తే వారికి ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది. అలాంటి ఉద్యోగుల కుటుంబ సభ్యులు చెల్లుబాటయ్యే రెసిడెన్సీ వీసాలు (Residence visas) కలిగి ఉంటే వారికి కూడా వర్తిస్తుంది. దుబాయ్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) ప్రకారం విదేశాల్లోని యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లలో చదువుతున్న ప్రవాస విద్యార్థులకు సైతం దీని నుంచి మినహాయింపు ఉంటుంది. 


Updated Date - 2022-07-31T17:14:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising