ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

PV Sindhuని సన్మానించిన సింగపూర్ తెలుగు సమాజం

ABN, First Publish Date - 2022-07-18T17:06:38+05:30

సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్- 2022లో అత్యంత ప్రతిభాపాటవాలు, విశ్వాసాన్ని ప్రదర్శించి టైటిల్ సాధించిన తెలుగు తేజం పి.వి.సింధుకు సింగపూర్ తెలుగు సమాజం ప్రత్యేకంగా అభినందనలు తెలిపి సన్మానించింది. వరుస విజయాలతో దూసుకు పోతూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్- 2022లో అత్యంత ప్రతిభాపాటవాలు, విశ్వాసాన్ని ప్రదర్శించి టైటిల్ సాధించిన తెలుగు తేజం పి.వి.సింధుకు సింగపూర్ తెలుగు సమాజం ప్రత్యేకంగా అభినందనలు తెలిపి సన్మానించింది.  వరుస విజయాలతో దూసుకు పోతూ.. తన కెరియర్ లోనే ఫస్ట్ సూపర్ 500 టైటిల్ తో పాటు ఈ ఏడాది మూడో టైటిల్‌ను సొంతం చేసుకోవడం విశేషం. ఈ సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ.. సింధు భారతదేశంతో పాటు తెలుగువారందరిని గర్వపడేలా చేసిందని, భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత కీర్తి శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. రానున్న కామన్ వెల్త్, వరల్డ్ ఛాంపియన్‌షిప్ గేమ్స్‌లో కూడా విజయం సాధించాలని శుభాకాంక్షలు తెలియజేశారు. 



ఈ సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం కార్యవర్గానికి సింధు కృతజ్ఞతలు చెప్పారు. తెలుగు సమాజం నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి తెలుసుకుని సేవలను కొనియాడారు. జూలై 31న సింగపూర్ తెలుగు సమాజం నిర్వహించనున్న బ్యాట్మింటన్ టోర్నమెంట్‌లో పాల్గొనే క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సమాజం ఆగష్టు13న నిర్వహించనున్న నారీ(లేడీస్ నైట్) కార్యక్రమాన్ని సింగపూర్‌లోని వనితలు వినియోగించుకోవాలని సూచించారు.

Updated Date - 2022-07-18T17:06:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising