ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇద్దరు భారతీయులకు షాకిచ్చిన Singapore కోర్టు.. భారీ మొత్తంలో..

ABN, First Publish Date - 2022-04-07T00:01:41+05:30

ఇద్దరు భారతీయులపై సింగపూర్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా భారీ మొత్తంలో జరిమానా విధిస్తూ షాకిచ్చింది. ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిందే అని స్పష్టం చేసింది. కాగా.. ఇందుకు సం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ఇద్దరు భారతీయులపై సింగపూర్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా భారీ మొత్తంలో జరిమానా విధిస్తూ షాకిచ్చింది. ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిందే అని స్పష్టం చేసింది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


కొవిడ్ నేపథ్యంలో ప్రపంచ దేశాలు కఠిన నిబంధనలు అమలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సింగపూర్ ప్రభుత్వం కూడా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడానికి కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. వాటిని ప్రజలందరూ పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ నిబంధనలను శ్యామ్ కుమార్, అతీశ్ రావు అనే ఇద్దరు భారతీయులు ఉల్లఘించారు. గత ఏడాది న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొని కొవిడ్ నియమాలను అతిక్రమించారు. దీంతో వేడుకల్లో పాల్గొన్న వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం.. శ్యామ్ కుమార్, అతీశ్ రావుతోపాటు ఇద్దరు విదేశీ యువకులకు జరిమాన విధించింది. ఒక్కొక్కరికి 1500 సింగపూర్ డాలర్ల (సుమారు రూ. 83వేల) ఫైన్ వేసింది. ప్రజా శ్రేయస్సు కోసం ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని కోర్టు తెలిపింది.  




Updated Date - 2022-04-07T00:01:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising