ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత విద్యార్థులకు సింగపూర్ కోర్టు షాక్.. భారీ మొత్తంలో ఫైన్.. వాళ్లు చేసిన తప్పు ఇదే!

ABN, First Publish Date - 2022-03-09T18:30:18+05:30

భారత విద్యార్థులపై సింగపూర్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండియన్ స్టూడెంట్స్ తప్పు చేసినట్టు రుజువు కావడంతో వారికి భారీ మొత్తంలో ఫైన్ విధించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: భారత విద్యార్థులపై సింగపూర్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండియన్ స్టూడెంట్స్ తప్పు చేసినట్టు రుజువు కావడంతో వారికి భారీ మొత్తంలో ఫైన్ విధించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం కరోనా ఉధృతి తగ్గింది. అయితే కొద్ది రోజుల క్రితం ఈ మహమ్మారి విజృంభించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రపంచ దేశాలు కఠిన నిబంధనలు అమలు చేశాయి. ఇందులో భాగంగానే సింగపూర్ ప్రభుత్వం కూడా కొవిడ్ నియమాలను అమలు చేసింది. అయితే.. ఈ నిబంధనలను భారత్‌కు చెందిన హర్జాజ్ సింగ్, వెర్మా పుల్కిత్ ఉల్లఘించారు. 



న్యూ ఇయర్ సందర్భంగా మాస్క్ లేకుండా వేడుకల్లో పాల్గొన్నారు. ఇదే సమయంలో పుట్టిన రోజు వేడుకలు కూడా చేసుకుని అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ క్రమంలో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు.. వారిని దోషులుగా తేల్చింది. పుల్కిత్‌కు రూ.1.68లక్షలు, హర్జాజ్ సింగ్‌కు 1.12లక్షల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. సింగపూర్‌లో అమలవుతున్న ఆదేశాల ప్రకారం కొవిడ్ నిబంధనలు ఉల్లఘించిన వారికి గరిష్టంగా రూ.5.62లక్షల వరకు ఫైన్ విధించనే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆరు నెలల జైలు శిక్ష కూడా పడొచ్చు. 




Updated Date - 2022-03-09T18:30:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising