ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Domestic violence: న్యూయార్క్‌లో ఎన్నారై మహిళ ఆత్మహత్య.. ఘటనకు ముందు తీసిన చివరి వీడియోతో..

ABN, First Publish Date - 2022-08-06T17:45:03+05:30

భర్త, అత్తమామల వేధింపులు తాళలేక న్యూయార్క్‌లో ఓ ఎన్నారై మహిళ ఆత్మహత్యకు పాల్పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: భర్త, అత్తమామల వేధింపులు తాళలేక న్యూయార్క్‌లో ఓ ఎన్నారై మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. అదనపు కట్నం కోసం గత ఎనిమిదేళ్లుగా తమ కూతురిని మెట్టినింటివారు చిత్రహింసలకు గురి చేస్తున్నారని, వారి వేధింపులు భరించలేక ఈ కఠిన నిర్ణయం తీసుకుందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. మృతురాలి ఇన్‌స్టాగ్రాం పేజీలో పోస్టు చేసిన చివరి వీడియో ఆధారంగా న్యూయార్క్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. సూసైడ్‌కు కొన్ని నిమిషాల ముందు ఈ వీడియోను ఆమె పోస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వీడియోలో ఆమె.. తనను భర్త శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని తనపై చేయిచేసుకోవడంతో అయిన గాయాలను సైతం ఆమె వీడియోలో చూపించినట్లు పోలీసులు పేర్కొన్నారు. 


యూపీలోని బిజ్నోర్‌కు చెందిన మృతురాలి తండ్రి మాట్లాడుతూ.. తన కూతురికి 2014లో న్యూయార్క్‌లో ట్రక్ డ్రైవర్‌గా పనిచేసే వ్యక్తితో పెళ్లి జరిగినట్లు తెలిపాడు. పెళ్లి తర్వాత రెండేళ్లు బిజ్నోర్‌లోనే ఉన్నారు. అయితే, వివాహమైన కొన్నిరోజులకే అదనపు కట్నం కోసం మెట్టినింటివారు వేధించడం మొదలెట్టారని చెప్పాడు. ఈ క్రమంలో వారికి ఓ పాప పుట్టిందని, దాంతో గొడవలు సద్దుమణుగుతాయని అనుకున్నట్లు తెలిపాడు. కానీ, అలా జరగలేదు. రెండేళ్ల తర్వాత న్యూయార్క్ వెళ్లిన అక్కడ ఆమెకు వేధింపులు తప్పలేదు. రూ. 25లక్షలు, ఓ లగ్జరీ కారు కావాలని ప్రతిరోజు ఆమెను భర్త చిత్రహింసలు పెట్టేవాడు. కొన్నిరోజులకు రెండో పాప పుట్టిన తర్వాత నుంచి భర్త వేధింపులు ఇంకా ఎక్కువ అయ్యాయి. పిల్లల ముందే ఆమెను ఇష్టానుసారంగా కొట్టడం, తిట్టడం చేసేవాడు. 


'నాన్న.. అమ్మను కొట్టొద్దని' అమ్మాయిలిద్దరూ ఏడుస్తున్న పట్టించుకునేవాడు కాదు. దీంతో తనకు జీవితాంతం ఈ వేధింపులు తప్పవని భావించిన ఆమె.. ఆగస్టు 3న ఆత్మహత్యకు పాల్పడింది. సూసైడ్‌కు ముందు ఓ వీడియో తీసి తన ఇన్‌స్టాగ్రాం పేజీ (@TheKaurMovement)లో పోస్ట్ చేసింది. అందులో భర్త, అతని తల్లిదండ్రులు అదనపు కట్నం కోసం తనను ఎలా వేధింపులకు గురి చేశారో వివరించింది. ఆ వీడియోనే ఇప్పుడు న్యూయార్క్ పోలీసులకు ప్రధాన ఆధారంగా మారింది. భార్య మృతికి కారణమైన భర్తపై గృహ హింస కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటు బిజ్నోర్‌తో పాటు అటు న్యూయార్క్‌లో అతనిపై కేసులు నమోదయ్యాయి.   


Updated Date - 2022-08-06T17:45:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising