ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో మళ్లీ పేలిన తూటా...ఒకటి మృతి, 20 మందికి గాయాలు..!

ABN, First Publish Date - 2022-03-20T21:24:22+05:30

అమెరికాలో మళ్లీ తూటా పేలింది. విరాళాలు సేకరించేందుకు తలపెట్టిన ఓ కార్‌ షోలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో 20 మంది గాయాలపాలయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డ్యూమాస్: అమెరికాలో మళ్లీ తూటా పేలింది. విరాళాలు సేకరించేందుకు తలపెట్టిన ఓ కార్‌ షోలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో 20 మంది గాయాలపాలయ్యారు. అర్కాన్సాస్ రాష్ట్రంలోని డ్యూమాస్ అనే టౌన్‌లో శనివారం ఈ దారుణం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించగా.. మరో చిన్నారికి గాయాలయ్యాయి. బాధితుల్లో మొత్తం ఎంత మంది చిన్నారులు ఉన్నారనేది ఇంకా తెలియరాలేదు.


కాల్పులు జరిపింది ఒకే వ్యక్తా కాదా అనే దానిపై స్పష్టత లేకపోయినప్పటికీ.. పలువురు కాల్పులకు తెగబడి ఉండొచ్చని డ్యూమాస్  పోలీస్ అధికారి కీత్ అనుమానం వ్యక్తం చేశారు. విద్యార్థులకు స్కాలర్‌షిప్స్, స్కూళ్లకు నిధుల కోసం విరాళాలు సేకరించేందుకు ఏటా స్థానికులు ఈ కార్‌ షో నిర్వహిస్తారు. ఇలాంటి ఘటన జరగడం చాలా విచారకరమని కార్ షో ప్రధాన నిర్వహకుడు వాలెస్ మెక్‌ఘీ వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది. 

Updated Date - 2022-03-20T21:24:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising