ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kuwait లో కలకలం.. ఏకంగా పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లి మరీ దాడి చేసిన ఏడుగురు వ్యక్తులు.. అసలేం జరిగిందంటే..

ABN, First Publish Date - 2022-09-20T17:43:02+05:30

కువైత్‌లోని సులైబియా పోలీస్ స్టేషన్‌ (Sulaibiya Police Station)లో జరిగిన ఓ ఘటన కలకలం రేపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: కువైత్‌లోని సులైబియా పోలీస్ స్టేషన్‌ (Sulaibiya Police Station)లో జరిగిన ఓ ఘటన కలకలం రేపింది. ఏడుగురు వ్యక్తులు ఏకంగా పోలీస్‌ స్టేషన్‌లోకి చొరబడి మరీ ఓ వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో కొద్దిసేపు పోలీస్ స్టేషన్‌లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ దాడిలో బాధితుడు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. దాడికి పాల్పడిన వారికోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దుండగుల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  


ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మొదట ఓ వ్యక్తి ఫిర్యాదు ఇవ్వడానికి సులైబియా పోలీస్ స్టేషన్‌‌కు వచ్చాడు. అతడు వచ్చి ఫిర్యాదు చేస్తుండగానే.. ఓ ఏడుగురు వ్యక్తులు పోలీస్ స్టేషన్‌లోకి చొరబడ్డారు. అనంతరం ఫిర్యాదు చేయడానికి వచ్చిన వ్యక్తిపై విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డారు. ఇది గమనించిన పోలీసులు ఆ ఏడుగురిని బెదిరించేందుకు గాలిలో కాల్పులు జరిపారు. దాంతో ఆ ఏడుగురు ఓ వాహనంలో అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వాటి ఆధారంగానే పోలీసులు ఇప్పుడు ఏడుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా, ఫిర్యాదు చేయడానికి వచ్చిన వ్యక్తి ఆ ఏడుగురు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు చెప్పారు. 

Updated Date - 2022-09-20T17:43:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising