ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: ఎన్నారైల ఓటు హక్కు.. కేంద్రానికి ‘సుప్రీం’ నోటీసులు

ABN, First Publish Date - 2022-08-19T00:48:24+05:30

ఎన్నారైలకు(NRI) ఓటు హక్కు విషయంలో దాఖలైన ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యంపై(PIL) సుప్రీం కోర్టు(Supreme court) బుధవారం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ఎన్నారైలకు(NRI) ఓటు హక్కు విషయంలో దాఖలైన ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యంపై(PIL) సుప్రీం కోర్టు(Supreme court) బుధవారం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.  విదేశాల్లో ఉంటున్న ఎన్నారైలు.. తాము నివసిస్తున్న లేదా ఉద్యోగం చేస్తున్న చోటునుంచే ఓటు హక్కు వినియోగించుకునే అంశంపై కేంద్రం అభిప్రాయం కోరింది. అంతేకాకుండా.. ఈ అంశంపై దాఖలైన వివిధ పిటిషన్లపై ఒకేసారి విచారణ చేపట్టాలని నిర్ణయించింది. కేరళ ప్రవాసీ సంఘం ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. దీనిపై చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సారథ్యంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.


పీపుల్స్ రీప్రెజెంటేషన్ యాక్ట్-1950లో సెక్షన్ 20ఏ ప్రకారం సంక్రమించిన హక్కులను వినియోగించుకునే అవకాశాన్ని కేంద్రం ఎన్నారైలకు ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి తగు ఆదేశాలు జారీ చేయాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఎన్నికల సమయంలో ఎన్నారైలు పోలీంగ్ కేంద్రానికి రావాలని పట్టుపట్టకుండా కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను చూపించాలని కోరారు. సెక్షన్ 20ఏ ప్రకారం.. ఎన్నారైలకు ఓటు హక్కు ఉన్నప్పటికీ.. విదేశాల్లో ఉంటూనే వారు ఓటు వేసే విషయంలో విస్పష్టమైన మార్గదర్శకాలేవీ చట్టంలో లేవని పేర్కొన్నారు. ఇది ఎన్నారైల ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమని తెలిపారు. 


కాగా.. గతేడాది ఫిబ్రవరిలోనే ఇదే అంశంపై దాఖలైన ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన సుప్రీం.. కేంద్రానికి, ఎన్నికల సంఘానికి(Election commission) నోటీసులు జారీ చేసింది. విదేశాల్లో ఉంటున్న ఎన్నారైలకు పోస్టల్ బ్యాలెట్ లేదా ఈ-వోటింగ్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించాలంటూ కే. సత్యం అనే వ్యక్తి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందుకు ప్రస్తుత ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. ఎన్నారైలు వర్చువల్‌గా ఓటు వేసేందుకు రిమోట్ ఎలక్ట్రానిక్ వోటింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో విదేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థులు, ఎన్నారైలకు ఓటు వేసే అవకాశం ఇవ్వాలన్నారు. ఇందుకోసం ఓటీపీ ఆధారిత వ్యవస్థ రూపకల్పన చేయాలని సూచించారు.



Updated Date - 2022-08-19T00:48:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising