ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Visit Visa పై సౌదీ వెళ్తున్నారా? అయితే ఇది తెలుసుకోండి..!

ABN, First Publish Date - 2022-06-01T17:47:51+05:30

Hajj season నేపథ్యంలో సౌదీ అరేబియా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయ్: Hajj season నేపథ్యంలో సౌదీ అరేబియా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 9వ తేదీ నుంచి జూలై 9 వరకు నెలరోజుల పాటు జెడ్డా, మదీనా, యాన్‌బు, తైఫ్‌లోని విమానాశ్రయాలకు అన్ని రకాల విజిట్ వీసాదారుల ప్రవేశాన్ని నిషేధించింది. ఈ మేరకు సౌదీ అరేబియా ఎయిర్‌లైన్స్ Saudia వెల్లడించింది. అందుకే ఈ నాలుగు ఎయిర్‌పోర్టుల ద్వారా కింగ్‌డమ్‌కు వచ్చే ప్రయాణికులకు విమాన టికెట్లను బుక్ చేయవద్దని టూరిజం, ట్రావెల్ ఏజెన్సీలను సూచించింది. కాగా, విజిట్ వీసాదారులు రియాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా దేశంలోకి ప్రవేశించవచ్చని పేర్కొంది. 


"అన్ని రకాల విజిట్ వీసాలను కలిగి ఉన్నవారు నాలుగు విమానాశ్రయాల ద్వారా రాజ్యంలోకి ప్రవేశించడానికి అనుమతించబడరు. ఇవి ఒక నెల రోజులు రాజ్యంలో లోపల, వెలుపల నుండి హజ్ పర్మిట్‌లను కలిగి ఉన్నవారికి మాత్రమే కేటాయించబడ్డాయి” అని సౌదియా స్టేట్ మీడియా నిర్వహించిన సమావేశంలో వెల్లడించింది. అలాగే కింగ్‌డమ్‌కు విజిట్ వీసాలపై వచ్చేవారు తప్పనిసరిగా రౌండ్ ట్రిప్ టిక్కెట్‌లను కలిగి ఉండాలని తెలిపింది. ఎందుకంటే రాక, తిరుగు ప్రయాణం రియాద్ విమానాశ్రయం ద్వారా ఉంటుందని ఎయిర్‌లైన్ తన ప్రకటనలో పేర్కొంది. 


Updated Date - 2022-06-01T17:47:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising