ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

World's Most Expensive Home: ఇంద్ర భవనాన్ని తలదన్నే భవంతిలో సౌదీ యువరాజు బస.. ఈ భవనం ప్రత్యేకతలు తెలిస్తే..!

ABN, First Publish Date - 2022-07-29T17:20:12+05:30

ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ బస చేస్తున్న విలాసవంతమైన భవనం తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన భవనాల్లో ఒకటిగా పేరొందిన ఈ భవంతి భూమిపై ఉన్న ఇంద్ర భవనంలా ఉంటుంది. చాటువు లూయిస్‌గా పిలువబడే ఈ భవంతని ప్రిన్స్ 2015లో కొనుగోలు చేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్యారిస్: ఫ్రాన్స్ (France) పర్యటనలో ఉన్న సౌదీ (Saudi) యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ (Mohammed bin Salman) బస చేస్తున్న విలాసవంతమైన భవనం తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన భవనాల్లో ఒకటిగా పేరొందిన ఈ భవంతి భూమిపై ఉన్న ఇంద్ర భవనంలా ఉంటుంది. చాటువు లూయిస్ XIV (Chateau Louis XIV)గా పిలువబడే ఈ భవంతని ప్రిన్స్ 2015లో కొనుగోలు చేశాడు. ప్యారిస్ (Paris) వెలుపల లూవెసియెన్నెస్‌లో ఈ విలాసవంతమైన భవంతి ఉంది. దీన్ని ఫ్రాన్స్‌లో (France) లగ్జరీ ప్రాపర్టీ డెవలప్‌మెంట్ బిజినెస్ నిర్వహించే జమాల్ ఖషోగ్గి (Jamal Khashoggi) బంధువు ఎమాద్ ఖషోగ్గి (Emad Khashoggi) నిర్మించారు. 


ఇంద్ర భవనాన్ని ఏమాత్రం తీసిపోని విధంగా ఉండే ఈ భవంతి 7వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మితమైంది. ఇందులో నైట్‌క్లబ్, గోల్డ్-లీఫ్ ఫౌంటెన్, సినిమా హాల్, తెల్లటి తోలు సోఫాలతో కూడిన నీటి అడుగున ఉండే గాజు గది, పెద్ద అక్వేరియం వంటివి ఉన్నాయి. 2015లో ప్రిన్స్ దీన్ని 275 మిలియన్ యూరోస్(రూ. 238,715,10,000)కు కొనుగోలు చేశారు. దాంతో ప్రముఖ మ్యాగ్జిన్ ఫార్చ్యూన్ ఈ విలాసవంతమైన భవంతిని ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లుగా పేర్కొంది. ఇప్పుడు సల్మాన్ బిన్ ఇందులో బస చేస్తుండడంతో మరోసారి వార్తల్లోకి ఎక్కింది. భవంతికి యువరాజు రావడంతో బయట మీడియా, భద్రతా సిబ్బంది హడావుడితో పండగ వాతావరణం నెలకొంది.  

Updated Date - 2022-07-29T17:20:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising