ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

21 ఏళ్లు అమ్మాయి అనుకునే బతికింది.. కానీ ఆ తర్వాత వైద్యులు చెప్పింది విని షాక్.. Saudi యువతి జీవితంలో ఊహించని మలుపు!

ABN, First Publish Date - 2022-05-24T15:20:42+05:30

21ఏళ్లు అమ్మాయి అనుకుని బతికిన తర్వాత సడెన్‌గా ఒకరోజు నీవు అమ్మాయి కాదు.. అబ్బాయి అంటే పరిస్థితి ఎలా ఉంటుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రియాద్: 21ఏళ్లు అమ్మాయి అనుకుని బతికిన తర్వాత సడెన్‌గా ఒకరోజు నీవు అమ్మాయి కాదు.. అబ్బాయి అంటే పరిస్థితి ఎలా ఉంటుంది. ఓ సౌదీ యువతి విషయంలో ఇదే జరిగింది. దీనంతటికి కారణం ఆమె పుట్టిన సమయంలో కనిపించిన చిన్న వైద్యలోపం. దాంతో వైద్యులు పొరబడి అప్పుడే పుట్టిన ఆ శిశువును అమ్మాయిగా నిర్ధారించేశారు. అలా 21 ఏళ్లు గడిచిపోయాయి. తీరా అనుమానం వచ్చి ఆ అమ్మాయి ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా 'ఆమె' కాదు 'అతడు' అని వైద్యులు షాకింగ్ విషయం చెప్పారు. ఇప్పుడీ వార్త సౌదీ సంచలనంగా మారింది. 


పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆ యువతి రియాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో జన్మించింది. ఆ సమయంలో ఆమె జననేంద్రియ ప్రాంతంలో కొన్ని వైకల్యాలు ఉన్నాయి. అయితే, ఆ శిశువును వైద్యులు ఆడ శిశువుగా భావించారు. అప్పుడే పుట్టిన ఆ బిడ్డకు రాండా షబెలి అని పేరు కూడా పెట్టారు. కానీ, ఆమె ఎదుగుతున్న కొద్ది స్త్రీల యుక్తవయస్సుకు సంబంధించిన ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడంతో రాండాకు అనుమానం వచ్చింది. దాంతో ఇటీవల చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్లింది. ఆ సమయంలో ఆమెకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు షాకింగ్ విషయం చెప్పారు. ఆమె పొత్తికడుపులో పురుష జననాంగాలు ఉన్నాయని తెలిపారు. అది విన్న ఆమెకు నోటమాట రాలేదు.


21 ఏళ్లు అమ్మాయి అనుకుని బతికిన తర్వాత ఇప్పుడు ఆమె కాదు అతడు అని చెప్పడంతో రాండాకు మతిపోయినంత పనైంది. ఇన్నాళ్లుగా బంధువులు, స్నేహితులు, తెలిసిన వారంతా రాండాను అమ్మాయిగానే అనుకున్నారు. కానీ, ఇప్పుడు అబ్బాయి అని చెప్పడంతో వారంతా షాక్ అవుతున్నారట. ఈ విషయం కాస్తా అక్కడి మీడియాకు తెలియడంతో వార్త బయటకు వచ్చింది. దాంతో రాండాను ప్రతిరోజు ఏదో ఒక మీడియా ఏజెన్సీ ఇంటర్వ్యూ నిర్వహించడం కామన్‌గా మారిపోయింది. 

Updated Date - 2022-05-24T15:20:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising