ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎగ్జిట్, రీఎంట్రీ వీసాల జారీపై Saudi Arabia కీలక ప్రకటన.. Jawazat చేసిన ఆ మార్పును ప్రవాసులు తప్పకుండా తెలుసుకోవాల్సిందే

ABN, First Publish Date - 2022-06-21T17:23:52+05:30

ప్రవాసులకు ఎగ్జిట్, రీఎంట్రీ వీసా జారీ చేయడానికి అవసరమైన కనీస గడువు 90 రోజులు అని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్స్(Jawazat) వెల్లడిచింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రియాద్: ప్రవాసులకు ఎగ్జిట్, రీఎంట్రీ వీసా జారీ చేయడానికి అవసరమైన కనీస గడువు 90 రోజులు అని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్స్(Jawazat) వెల్లడిచింది. ఎగ్జిట్, రీఎంట్రీ వీసా వ్యవధిని నెలల్లో(60,90,120 రోజులు) నిర్దేశిస్తే, వీసా జారీ చేసిన తేదీ నుంచి ప్రయాణానికి మూడు నెలల వరకు చెల్లుబాటు అవుతుందని జవాజత్ వెల్లడించింది. వీసా వ్యవధి ప్రయాణ తేదీ నుంచి లెక్కించబడుతుందని లేదా నిర్దిష్ట తేదీకి ముందే తిరిగి వచ్చినట్లయితే వీసా వ్యవధిని దాని జారీ తేదీ నుంచి లెక్కించడం జరుగుతుందని స్పష్టం చేసింది. ఒకే ఎగ్జిట్, రీఎంట్రీ వీసాను జారీ చేయడానికి రుసుము గరిష్టంగా రెండు నెలల వ్యవధితో(ఒకే ట్రిప్) 200 సౌదీ రియాల్స్(రూ.4,164) అని తెలిపింది. 


ఇక మల్టీపుల్ ఎగ్జిట్, రీఎంట్రీ వీసా జారీకి రుసుము గరిష్టంగా 3 నెలలకు 500 సౌదీ రియాళ్లుగా(రూ.10వేలు) పేర్కొన్న జవాజత్.. ఇఖామా చెల్లుబాటు వ్యవధిలోపు అదనపు నెలకు 200 సౌదీ రియాల్స్(రూ.4,164) వసూలు చేయనున్నట్లు వెల్లడించింది. ఇక తాజాగా జవాజత్ మరో కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఎగ్జిట్, రీ-ఎంట్రీ వీసాతో రాజ్యాన్ని విడిచిపెట్టి, నిర్దేశిత గడువులోపు తిరిగి రాని ప్రవాసులపై మూడేళ్ల నిషేధాన్ని విధిస్తున్నట్లు వెల్లడించింది. ఒక ప్రవాసుడు వారి వీసాలలో పేర్కొన్న వ్యవధిలోపు తిరిగి రాకపోతే, యజమాని కొత్త వీసాను జారీ చేయవలసి ఉంటుందని తెలిపింది. 


Updated Date - 2022-06-21T17:23:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising