ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Saudi Arabia: ట్విటర్ తెచ్చిన తంటా.. సౌదీలో మహిళకు 34 ఏళ్ల జైలు.. అసలేం జరిగిందంటే..!

ABN, First Publish Date - 2022-08-19T18:07:55+05:30

సౌదీ అరేబియా (Saudi Arabia)లో సల్మా అల్ షెహబ్ (Salma al shehab) అనే మహిళకు అక్కడి కోర్టు తాజాగా 34 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రియాద్: సౌదీ అరేబియా (Saudi Arabia)లో సల్మా అల్ షెహబ్ (Salma al shehab) అనే మహిళకు అక్కడి కోర్టు తాజాగా 34 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇంతకీ ఆమె చేసిన నేరమేంటంటే.. అసమ్మతివాదులను ట్విటర్‌ (Twitter)లో ఫాలోకావడంతో పాటు వారి పోస్టులను రీట్వీట్‌ చేయడం. దీంతో దేశ శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం, దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా సోషల్ మీడియా (Social Media)ను వినియోగించిందనే ఆరోపణలపై బ్రిటన్‌లోని లీడ్స్ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ (PhD) చేస్తున్న సల్మాను 2021 జనవరి 15న సౌదీలో అదుపులోకి తీసుకున్నారు. సెలవులపై స్వదేశానికి వచ్చిన ఆమె.. తిరిగి వెళ్లేందుకు రెడీ అవుతున్న సమయంలో అరెస్ట్ చేశారు. ఆ సమయంలో ప్రత్యేక ఉగ్రవాద కోర్టు ఆమెకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. తాజాగా సోమవారం అప్పీల్ కోర్టు 34 ఏళ్ల జైలు శిక్ష, 34 సంవత్సరాల ప్రయాణ నిషేధం విధిస్తూ తీర్పునిచ్చింది. 



కాగా, సౌదీ అరేబియా మహిళ హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తున్న సల్మాకు సుదీర్ఘ జైలు శిక్ష విధించడం పట్ల అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. ఆమెను వెంటనే విడుదల చేయాలని మానవ హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో పెద్దగా ఆదరణ లేనప్పటికీ సల్మాకు సుదీర్ఘ కాలం జైలు శిక్ష విధించడం పట్ల స్వచ్ఛంద సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆమెను ట్విటర్‌లో 2,597 మంది అనుసరిస్తుండగా, ఇన్‌స్టాగ్రామ్‌లో 159 మంది ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు. ఆమె షియా ముస్లిం కావడం వల్లే అన్యాయంగా అరెస్ట్‌ చేసి, కఠిన శిక్ష విధించారని యునైటెడ్ స్టేట్స్ కమీషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడమ్ పేర్కొంది. ఇదిలాఉంటే.. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) జెడ్డాలో జూలై 15న కలిసిన కొద్ది రోజుల తర్వాత సల్మాకు సుదీర్ఘ జైలు శిక్ష విధిస్తూ తీర్పు రావడం గమనార్హం. 

Updated Date - 2022-08-19T18:07:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising