ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Visa లపై సౌదీ అరేబియా కీలక నిర్ణయం.. ఇకపై దానికి యజమాని అనుమతి అవసరం లేదు

ABN, First Publish Date - 2022-07-01T15:07:15+05:30

వీసాల మార్పిడికి సంబంధించి సౌదీ అరేబియా ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకోంది. ఇళ్లల్లో పని చేయడానికి వచ్చే భారతీయులు, ఇతర విదేశీయులు ఇకపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీసాలు మార్చుకోచ్చు. నూతన ఉద్యోగాలలో చేరడానికి, మాతృదేశానికి తిరిగి వెళ్లడానికి వీలుగా ఈ మార్పు చేసుకోవచ్చు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వీసాల మార్పిడి ఇక సులభం

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి): వీసాల మార్పిడికి సంబంధించి సౌదీ అరేబియా ప్రభుత్వం గురువారం  కీలక నిర్ణయం తీసుకోంది. ఇళ్లల్లో పని చేయడానికి వచ్చే భారతీయులు,  ఇతర విదేశీయులు ఇకపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీసాలు మార్చుకోచ్చు. నూతన ఉద్యోగాలలో చేరడానికి, మాతృదేశానికి తిరిగి వెళ్లడానికి వీలుగా ఈ మార్పు చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఉన్న చట్టం ప్రకారం యాజమానికి అంగీకారం ఉంటేనే వీసాను మార్చుకోవడానికి వీలుంటుంది. అయితే యాజమానులు అంగీకరించని కారణంగా వందలాది మంది తెలుగు డ్రైవర్లు, ఇతర పని మనుషులు ఇతర ప్రాంతాలకు వెళ్లడానికిగానీ, మరో ఉద్యోగంలో చేరడానికిగానీ అవకాశం ఉండేది కాదు. మోసపోయిన సందర్భాల్లోనూ అక్కడ నుంచి కదలలేని పరిస్థితి. స్వదేశానికి తిరిగి వెళ్లడానికి సహకరించాలని భారత రాయబార కార్యాలయాన్ని అర్థించినా అక్కడి అధికారులు కూడా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండేవారు. వీటన్నింటికి ముగింపు పలికేలా సౌదీ ప్రభుత్వం నిర్ణయాన్ని వెలువరించింది.


ఇక నుంచి మూడు సందర్భాల్లో  యాజమాని ఆమోదం అవసరం లేకుండా విదేశీయులు తమ ఉద్యోగాలు మార్చుకోవచ్చు.  మూడు నెలల పాటు క్రమంగా వేతనం చెల్లించకపోవడం.  దేశంలోకి వచ్చిన 15 రోజుల వరకు అఖమా ఇవ్వకపోవడం. అఖమా గడువు ముగిసిన ఒక నెలలోపు దాన్ని రెన్యువల్‌ చేయకపోవడం. ఇలాంటి పరిస్థితులు ఎదురయినప్పుడు విదేశీ ఉద్యోగి తాను పని చేస్తున్న యాజమాని సమ్మతితో సంబంధం లేకుండా ఇతర చోట ఉద్యోగంలో చేరవచ్చు. ఒక వేళ స్వదేశానికి తిరిగి వెళ్లాలనుకుంటే వెళ్లిపోవచ్చని అధికారవర్గాలు తెలిపాయి.

Updated Date - 2022-07-01T15:07:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising